ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి నుంచి కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. 12 వ విడత నిధులు ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. అయితే దేశంలోని కొంతమంది రైతులకు ఇప్పటివరకు 12 విడత డబ్బులు అందలేదు. ఈ డబ్బులు అందని రైతులకు నవంబర్ 30వ తేదీలోకి అకౌంట్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు.
డబ్బులు జమ కానట్లయితే…ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు.
ఇప్పటివరకు అకౌంట్లో డబ్బులు జమకానీ రైతులు వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం తెలిపింది. నవంబర్ 30వ తేదీ నాటికి వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయాని..రాని పక్షంలో ఫిర్యాదు చేయాలని పేర్కొంది.
పీఎం కిసాన్ డబ్బులు జమ కానీ రూైతులు హెల్ప్ లైన్ నెంబర్స్ కు ఫోన్ చేసిన ఫిర్యాదు చేయవచ్చు. 155261 / 011-24300606 ఈ టోలో ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.