Site icon HashtagU Telugu

PM Kisan : పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!

21st Installment

21st Installment

PM Kisan : రైతుల సంక్షేమం, వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద నూతన నిధులు జమయ్యాయి. ఈ పథకంలోని 20వ విడత కింద వచ్చే నిధులను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి ఏడాది మూడు విడతల్లో మొత్తం రూ.6వేల సాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున మద్దతు అందుతుంది.

Read Also: Gold Prices: చుక్క‌లు చూపిస్తున్న బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా?

పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 19 విడతల ద్వారా దాదాపు రూ.3.46 లక్షల కోట్లను 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. తాజాగా విడుదలైన ఈ 20వ విడతతో కూడలి ఆ మొత్తం మరింత పెరిగింది. ఈ పథకం ద్వారా దేశంలోని చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి అవసరాలకు కొంతవరకైనా ఊరట పొందుతున్నారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనులు మొదలైన వాటికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో ఈ సాయం ఉపయోగపడుతోంది. అంతేకాకుండా, మధ్యవర్తుల హస్తक्षేపం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం వల్ల పారదర్శకత, సమర్థత మరింత పెరిగాయి.

వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..రైతుల శ్రమను గౌరవించడమే ఈ పథకం ఉద్దేశం. రైతులు పండించే అన్నంతో దేశం పోషితమవుతుంది. వారి స్థితిగతులను మెరుగుపర్చేందుకు కేంద్రం ప్రతినిత్యం కృషి చేస్తోంది అని తెలిపారు. అలాగే, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఆదాయం పెరిగిందని, ఇది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇకపోతే, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్రం ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. ఆధార్ లింక్‌, బ్యాంక్ ఖాతా ధృవీకరణ వంటి చర్యల ద్వారా అర్హులైనవారికే నిధులు చేరేలా చర్యలు తీసుకుంటోంది. ఈ విధంగా పీఎం కిసాన్ పథకం రైతుల జీవితాల్లో నూతన ఆశలు నింపుతోంది. నేరుగా సహాయం అందడం, ప్రతి రైతు ఇంటికి మద్దతుగా నిలవడం ద్వారా ఈ పథకం దేశవ్యాప్తంగా రైతుల్లో విశ్వాసాన్ని కలిగించింది.

ఖాతాలో జ‌మ‌య్యిందా? తెలుసుకోండిలా..

. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
. కుడి వైపున క‌నిపిస్తున్న ఆప్ష‌న్ల‌లో బెనిఫిషియ‌రీ స్టేట‌స్ ఆప్ష‌న్ ఉంటుంది.
. సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత ఖాతా నెంబ‌రును ఎంట‌ర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ‘గెట్ డేటా’ పై క్లిక్ చేయాలి.
. స్టేట‌స్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. ఒక‌వేళ మీరు పీఎం కిసాన్‌కు రిజిస్ట‌ర్ చేసుకొని, ఈ-కేవైసీ పూర్తిచేసి ఉంటే ఖాతాలోకి డ‌బ్బు జ‌మ‌వుతుంది.
. అలాగే ల‌బ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవ‌చ్చు.
. బెనిఫిషియ‌రీ స్టేట‌స్ కింద బెనిఫిషియ‌రీ లిస్ట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
. ఈ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే మ‌రొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
ఇక్క‌డ ల‌బ్ధిదారుడి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాల‌ను ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్‌’పై క్లిక్ చేస్తే ల‌బ్ధిదారుల జాబితా క‌నిపిస్తుంది.
. పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌రు 155261 / 011-24300606 కు కాల్ చేసి కూడా స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.

Read Also: Flipkart : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో టాబ్లెట్‌లపై అద్భుతమైన ఆఫర్లు..మీకు సరైనది ఎంచుకోండి!

 

Exit mobile version