Site icon HashtagU Telugu

PM Modi Kasi : ‘కాశీ విశ్వ‌నాథుని కారిడార్’ మాదే.!

Modi Varanasi

Modi Varanasi

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కాశీవిశ్వ‌నాథుని కారిడార్ ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. మూడేళ్ల‌లో 339 కోట్ల‌తో నిర్మిత‌మైన ఆ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం త‌మ‌దేనంటూ బీజేపీ వాదిస్తోంది. ఆ ప్రాజెక్టును త‌న హ‌యాంలో ఆమోదం పొందింద‌నే విష‌యాన్ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ చెబుతున్నాడు. అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను చూప‌డానికి సిద్ధ‌మంటూ ఆయ‌న స‌వాల్ చేస్తున్నాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల క్ర‌మంలో కాశీవిశ్వ‌నాథుని కారిడార్ ను సానుకూల రాజకీయ అస్త్రంగా మారింది.

రెండు రోజుల వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంద‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. వ‌యోధికుల‌కు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక‌మైన‌ జెట్టీలు, ఎస్కలేట‌ర్లు ఆల‌య‌ ప్రవేశం వ‌ర‌కు క‌ల్పించ‌డాన్ని మోడీ ప్ర‌స్తావించాడు.కారిడార్ ప్రారంభం సంద‌ర్భంగా గంగా నదిలో మోడీ పుణ్యస్నానం చేసి ప్రార్థనలు చేశాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయ‌న‌కు స్వాగతం పలికాడు. లోక్‌సభ నియోజకవర్గం ప్రజల నుంచి మోడీకి ఘన స్వాగతం ల‌భించింది. టెంపుల్ సిటీ కోసం ఈ ప్రాజెక్టును రూ. 339-కోట్లతో నిర్మించేందుకు మార్చి 8, 2019 న మోడీ పునాది వేశాడు. కోవిడ్ రెండున్న‌రేళ్లుగా ఉన్న‌ప్ప‌టికీ ప్రణాళిక ప్రకారం మూడేళ్ల‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌డం బీజేపీ సానుకూల అంశంగా మ‌లుచుకుంటోంది.

కాశీ విశ్వేశ్వ‌రుడ్ని ద‌ర్శించుకోవ‌డానికి ఇరుకు వీధుల నుంచి వెళ్లాల్సి వ‌చ్చేది. గంగా స్నానంకు వెళ్ల‌డానికి కూడా గంద‌ర‌గోళ స‌న్న‌ని వీధుల‌ ద్వారా భ‌క్తులు వెళ్లే వాళ్లు. కానీ, ఇప్పుడు ఇక గంగా నదిలో స్నానం చేయడానికి , ఆలయం వద్ద పవిత్ర నదీ జలాలను సమర్పించడానికి సుల‌భంగా వెళ్ల‌డానికి ఈ కారిడార్ ఉప‌యుక్తంగా ఉంటుంది. ఈ కారిడార్ ప్రారంభంతో కాశీవిశ్వ‌నాథుని ద‌ర్శ‌నం తేలిక కానుంది.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న త‌రుణంలో ఇటీవ‌ల ప్రారంభించిన పూర్వాంచ‌ల్ ఎక్స్ ప్రెస్ వే, సోమ‌వారం అందుబాటులోకి వ‌చ్చిన కాశీవిశ్వ‌నాథుని కారిడార్ రాజ‌కీయ పార్టీల‌కు అస్త్రంగా మారాయి. ఈ రెండు ప్రాజెక్టులు ఓట‌ర్ల మీద ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. అందుకే, బీజేపీ, ఎస్పీ పార్టీలు త‌మ ఖాతాలో వేసుకోవ‌డానికి ఈ రెండు ప్రాజెక్టుల‌ను హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Exit mobile version