Site icon HashtagU Telugu

Glider Plane Crash: ఇంటిపై కూలిన గ్లైడర్.. పైలట్‌తో సహా ఇద్దరికి తీవ్ర గాయాలు

Glider Plane Crash

Resizeimagesize (1280 X 720)

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో జాయ్‌రైడ్ గ్లైడర్ (Glider Plane) టేకాఫ్ అయిన వెంటనే నివాస భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు 14 ఏళ్ల ప్రయాణికుడు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మీడియా కథనాల ప్రకారం.. ధన్‌బాద్‌లోని బార్వాడా ఎయిర్‌స్ట్రిప్ నుండి గ్లైడర్ బయలుదేరి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం సరైన విచారణ తర్వాతే తేలనుంది. గ్లైడర్ పడిపోయిన ఇంటి యజమాని నీలేష్ కుమార్ మాట్లాడుతూ.. తమ కుటుంబంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. ఇంట్లో ఆడుకుంటున్న తన ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్నారని తెలిపారు. గురువారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

Also Read: Ram Charan: సీఈఓ సినిమా నుంచి మరో లీక్.. సరికొత్త లుక్ లో రామ్ చరణ్?

ఈ ప్రమాదం జరిగిన సమయంలో గ్లైడర్‌లో పైలట్‌తో పాటు ఒక ప్రయాణికుడు కూడా ఉన్నారని, అతని వయస్సు 14 సంవత్సరాలు. అతను బీహార్‌లోని పాట్నా నుండి ధన్‌బాద్‌లోని తన మామయ్య ఇంటికి వచ్చాడు. సమాచారం ప్రకారం.. ధన్‌బాద్‌లో ఒక ప్రైవేట్ ఏజెన్సీ గ్లైడర్ సేవను నడుపుతోంది. ఇందులో పైలట్, ఒక ప్రయాణికుడుని మాత్రమే అనుమతి ఇస్తారు. ధన్‌బాద్ ప్రజలు తమ నగరాన్ని ఆకాశం నుండి చూసి ఆనందించడం కోసం ఈ గ్లైడర్ సర్వీస్ ప్రారంభించబడింది. అయితే ప్రమాదం తర్వాత నగరంలో ఏరియల్‌ టూర్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు.