లోన్(Loan)పై కొనుగోలు చేసిన ఫోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నియమాలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రుణదాతలు ఫోన్‌లకు సంబంధించిన రుణాలను సకాలంలో చెల్లించని పక్షంలో, ఆ ఫోన్‌లను రిమోట్‌గా లాక్ చేసే అధికారాన్ని రుణదాతలకు కల్పించనుంది. ఈ కొత్త నియమాలు అమల్లోకి వస్తే, లోన్ EMIలు చెల్లించని వినియోగదారుల ఫోన్‌లు పనిచేయకుండా పోయే అవకాశం ఉంది.
PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!
ఈ విధానాన్ని అమలు చేయడానికి, వినియోగదారుడి ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆర్‌బీఐ తెలిపింది. అంతేకాకుండా, వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఆర్‌బీఐ రూపొందించనుంది. ఈ నియమం ప్రకారం, ఫోన్ కొనుగోలు చేసే సమయంలోనే అందులో ఒక ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ యాప్ ద్వారానే లోన్ చెల్లింపుల స్థితిని పర్యవేక్షిస్తారు.
ఈ కొత్త నిబంధన వల్ల వినియోగదారులకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, రుణాల చెల్లింపుల్లో క్రమశిక్షణ పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. రుణదాతలకు కూడా ఇది మేలు చేస్తుందని, బకాయిలు రికవరీ చేయడం సులభం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ విషయంలో ఇంకా తుది మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.