PFI : జడ్జీలు, పోలీస్ అధికారులు, యూదులే లక్ష్యంగా పీఎఫ్ఐ కుట్ర..!!!

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణే కాకుండా...మతకల్లోలాలకు ప్లాన్ చేసిన పీఎఫ్ఐను కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధించిన సంగతి తెలిసిందే. పీఎఫ్ఐతోపాటు దాని 8 అనుబంధ సంస్థలను కూడా బ్యాన్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 05:07 AM IST

దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణే కాకుండా…మతకల్లోలాలకు ప్లాన్ చేసిన పీఎఫ్ఐను కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధించిన సంగతి తెలిసిందే. పీఎఫ్ఐతోపాటు దాని 8 అనుబంధ సంస్థలను కూడా బ్యాన్ చేసింది. పీఎఫ్ఐని బ్యాన్ చేసిన రెండు రోజులకే దానికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా కేంద్రం బ్యాన్ చేసింది. కాగా హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ పోలీసు అధికారులు, అహ్మదీయ ముస్లింలు, విదేశీయులు, ముఖ్యంగా యూదులపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) కుట్ర పన్నినట్లు కేంద్రం, రాష్ట్రాల అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో దొరికిన పత్రాలు 2047 వరకు పీఎఫ్‌ఐకి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను కూడా వెల్లడించాయని తెలిపారు.

సంఘవిద్రోహ చర్యలకు ప్లాన్:
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 15 మంది యువకులు, వారి సహచరులతో కూడిన మాడ్యూల్ పేర్కొన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నారు. వీరిలో ఎక్కువ మంది పీఎఫ్‌ఐ సభ్యులు లేదా ఐఎస్‌ ఆకర్షిత వ్యక్తులు ఉన్నారు. ప్రముఖులతోపాటు ప్రజా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి మాడ్యూల్ పేలుడు పదార్థాలు ఇతర విధ్వంసక పదార్థాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.

తమిళనాడులోని చిన్న హిల్ స్టేషన్ అయిన వట్టక్కనల్‌ను సందర్శించే విదేశీయులపై, ముఖ్యంగా యూదులపై దాడి చేసేందుకు కూడా మాడ్యూల్ ప్లాన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తమిళనాడులో ఒక చిన్న పర్వత ప్రాంతం అయిన వట్టనక్కల్ కు ప్రతిఏటా వందలాది మంది ఇజ్రాయెల్ యువకులు సందర్శనకు వస్తుంటారు. వారిని లక్ష్యం చేసుకుని దాడులకు ప్లాన్ చేసింది.

ఫేస్‌బుక్, టెలిగ్రామ్ లలో దేశంలో అల్లర్లకు ప్లాన్:
ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ లో అల్లర్లు స్రుష్టించాలన్న ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన స్వాలిత్ మహ్మద్ తన కార్యకలాపాల కోసం UAEలోని తన సహచరుల నుంచి డబ్బులు పొందేవాడని తెలిపాడు. నిందితులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సభ్యులను చేర్చుకున్నారని, ‘ది గేట్’, ‘బాబ్ అల్ నూర్’, ‘ప్లే గ్రౌండ్’ వంటి వివిధ టెలిగ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. మరోవైపు కర్ణాటక, అసోం సహా వివిధ రాష్ట్రాలు పీఎఫ్‌ఐ, అనుబంధ సంస్థల కార్యాలయాలకు సీల్ వేయడంతోపాటు వారి ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపాయి. ట్విట్టర్ కూడా PFI హ్యాండిల్‌ను మూసివేసింది.

పెట్రోల్ బాంబు దాడి హెచ్చరిక:
పొల్లాచ్చి పట్టణంలోని 16 చోట్ల పెట్రోల్ బాంబులు విసురుతామని బెదిరింపు లేఖ అందిందని తమిళనాడు పోలీసులు తెలిపారు. ఇది PFI దాని పొలిటికల్ విభాగం SDPI పేరుతో జారీ అయ్యింది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) చీఫ్ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవలి ఆపరేషన్ సమయంలో, PFI తో అనుబంధం ఉన్నందుకు అరెస్టయిన వారి నుండి ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి.

వాటిలో ఒకటి భారత్ ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చడానికి సంస్థ నిబద్ధతను కలిగి ఉంది. ఇందులో 2047. తయారీకి సంబంధించిన రోడ్‌మ్యాప్ గురించి క్లియర్ గా ఉంది. పత్రాల్లో లభించిన కీలక సమాచారం ప్రకారం.. తమ ఎజెండాలో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్‌తో సహా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయాలని ప్లాన్ చేశారు.