Site icon HashtagU Telugu

PFI Activist Arrest : అయోధ్యలో పీఎఫ్ఐ కార్యకర్త అరెస్ట్

Pfi

Pfi

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పోలీసులు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్తను అరెస్ట్ చేశారు. హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టడం మరియు ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా హిందూ సమాజ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడంతో సహా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. అరెస్టయిన నిందితుడు మహ్మద్ జైద్ మర్కజ్ నిజాముద్దీన్‌కు చెందిన తబ్లిగి జమాత్‌లో క్రియాశీల సభ్యుడుగా, ప్రసిద్ధ ఇస్లామిక్ సెమినరీ నద్వా పూర్వ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. జైద్ కేరళలో నిర్వహించే పీఎఫ్‌ఐ కార్యక్రమాల్లో పాల్గొన్నాడ‌ని పోలీసులు తెలిపారు. సంస్థ అగ్ర నాయకులతో జైద్ సంబంధాలు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. అయోధ్యకు చెందిన పిఎఫ్‌ఐ కార్యకర్తను అరెస్టు చేయడం ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం ఆరోపించిన పిఎఫ్‌ఐ కార్యకర్త అక్రమ్‌ను గత వారం బికాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. అక్రమ్‌ను విచారించగా జైద్‌కు సంబంధించిన సమాచారం వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వీరంతా కలిసి అయోధ్యలో పీఎఫ్‌ఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Exit mobile version