Budget 6 Key Announcements : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇది నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్. ఈసారి 6 ప్రధాన అంశాలపై కీలక ప్రకటనలు వచ్చే అవకాశముంది. ప్రజల అవసరాలు, బీజేపీ మేనిఫెస్టో, ప్రభుత్వం, మీడియా నివేదికల ఆధారంగా ఆ అంశాలేంటో మనం చూద్దాం..
Also Read :Hyderabad Student: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాదీ విద్యార్థి మృతి
ఈ బడ్జెట్‌లో 6 కీలక ప్రకటనలు ఇవేనా ?
1.పెట్రోల్-డీజిల్ ధరల తగ్గుదల
ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించే దిశగా కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.19.90, డీజిల్‌పై రూ.15.80 మేర ఎక్సైజ్ డ్యూటీ ఉంది. మొబైల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఉపయోగించే కొన్ని విడి భాగాలపై దిగుమతి సుంకం (ఇంపోర్ట్ డ్యూటీ) 20 శాతం మేర తగ్గించే అవకాశముంది. బంగారం, వెండి దిగుమతులపై ప్రస్తుతం 6 శాతమున్న ఇంపోర్ట్ డ్యూటీని పెంచే ఛాన్స్ ఉంది. దీనివల్ల బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.
2. ఆదాయపు పన్ను మినహాయింపు.. పన్ను శ్లాబ్‌లలో మార్పులు
నూతన ట్యాక్స్ విధానంలో రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్నును మినహాయించే(Income Tax Exemption) అవకాశం ఉంటుంది. రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం మేర కొత్త ట్యాక్స్ బ్రాకెట్‌ను తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రూ.15 లక్షలకుపైగా ఆదాయానికి 30 శాతం మేర పన్ను ఉంది. కనీస మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
Also Read :Cyber Crimes : సైబర్ కేటుగాళ్లతో బ్యాంకు ఉద్యోగులకు లింకులు.. బండారం బయటపెట్టిన పోలీసులు
3. రైతులు, పింఛనుదారులకు పెంపు
- పీఎం కిసాన్ పథకం: రైతులకు ప్రస్తుతం సంవత్సరానికి రూ.6,000 మేర అందిస్తున్న నిధిని రూ.12వేలకు పెంచే అవకాశముంది.
- ఆయుష్మాన్ భారత్ పథకం: దీన్ని 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు మరింత పెంచే అవకాశం ఉంది.
- అటల్ పెన్షన్ యోజన (APY): ప్రస్తుతం నెలకు గరిష్టంగా రూ.5,000 ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రూ.10వేలకు పెంచే అవకాశం ఉంది.
4. గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు
- ఇంటెగ్రేటెడ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని అమలులోకి తెచ్చే అవకాశం ఉంది.
- గ్రామీణ యువతకు ఇంటర్న్‌షిప్ : ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రాడ్యుయేట్ యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.
- అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల కోసం కొత్త అథారిటీ : విదేశాలలో ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించేందుకు ఇంటర్నేషనల్ మొబిలిటీ అథారిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
- స్టార్టప్‌లకు ప్రోత్సాహం : కొత్త ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది.
Also Read :YCP : చంద్రబాబు ను అరెస్ట్ చేయడం మీము చేసిన పెద్ద తప్పు – కేతిరెడ్డి
5. వైద్యరంగానికి మరిన్ని నిధులు
- దేశ ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచే అవకాశం ఉంది. గత ఏడాది దీనికి రూ.90,958 కోట్ల నిధులు కేటాయించారు.
- MRI, ఇతర మెడికల్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం మేర తగ్గించవచ్చు.
- వచ్చే 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజీల్లో 75వేల కొత్త మెడికల్ సీట్లను అందుబాటులోకి తేవడానికి ప్రణాళిక రచించే అవకాశం ఉంది.
6. హౌసింగ్ విభాగంలో శుభవార్తలు
- మెట్రో నగరాల్లో చౌకైన ఇళ్ల ఖరీదు పరిమితిని రూ.45 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
- ఇతర నగరాల్లో ఈ పరిమితిని రూ.50 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది.
- హోం లోన్‌పై వడ్డీకి ఇచ్చే పన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
ఈ మార్పుల వెనుక కారణాలు
- పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఐఐ (Confederation of Indian Industry) సిఫార్సు చేసింది.
- మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎలక్ట్రానిక్స్ భాగాల దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశం ఉంది.
- బంగారం దిగుమతి పెరగడం వల్ల వ్యాపార లోటు (Trade Deficit) పెరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని పెంచే ఛాన్స్ ఉంది.
- ప్రజలకు తక్కువ పన్నుతో ఆదాయాన్ని పెంచే అవకాశాన్ని కల్పించేందుకు కొత్త ట్యాక్స్ విధానాన్ని రూపొందిస్తున్నారు.
- వ్యవసాయ, వైద్య రంగాల్లో రాబోయే ఎన్నికల దృష్ట్యా మరింత ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
- ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన అనంతరం ఈ విభాగాల్లో మార్పులు ఎంతవరకు ఉంటాయో వేచిచూడాలి!