Site icon HashtagU Telugu

Fuel Price in India: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు

Free At Petrol Pump

Free At Petrol Pump

Fuel Price in India: ఓ వైపు భగభగ మండుతున్న ఎండలు మరోవైపు పెట్రోల్ రేట్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తారు. ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటలకు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎటువంటు మార్పు కనిపించలేదు. అదే పెట్రోల్, డీజిల్ ధరలతో కొనసాగుతుంది. అప్పుడెప్పుడో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై రేట్లను తగ్గించి చేతులు దులుపుకుంది. సంవత్సరం క్రితం అంటే 2022 మే 21న పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప మార్పు కనిపించింది. ఏడాది దాటినా వీటిలో మార్పు లేకపోవడంతో వాహనదారులు ఆర్ధికంగా ఇబ్బందులు పడక తప్పట్లేదు.

రాజధాని ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా కొనసాగుతుంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.89.62 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక రాజధాని ముంబైలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

చెన్నైలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.102.63. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76కు విక్రయిస్తున్నారు.

లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.47, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.

పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.24 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.32 వద్ద కొనసాగుతోంది.

 

జైపూర్‌లో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.108.48 మరియు 1 లీటర్ డీజిల్ ధర రూ.93.99.

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.65గా, లీటర్ డీజిల్ ధర రూ.89.82గా కొనసాగుతోంది.

గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.04, డీజిల్ ధర రూ.89.91గా ఉంది.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.92గా కొనసాగుతోంది.

Read More: Mission 24: మిషన్ 24… విపక్షాల ఐక్యతకు నితీష్ దూకుడు