Petrol Diesel Price: దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రభుత్వం రెండు రూపాయల కోత విధించింది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రభుత్వం రెండు రూపాయల కోత విధించింది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రెండు రూపాయలు తగ్గిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై 2 రూపాయలు తగ్గించడం ద్వారా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ధరలను తగ్గించడం రాజకీయ ఉద్దేశమని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ధరల తగ్గుదల కారణంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు మరికొందరు.

తగ్గిన ధరల ప్రకారం రేపటి నుంచి ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.72 కాగా ముంబైలో రూ.104.21కు లభిస్తుంది. అలాగే కోల్‌కతా రూ.103.94, చెన్నై రూ.100.75 కి లభిస్తుంది. డీజిల్ ఢిల్లీలో రూ.87.62,ముంబైలో రూ.92.15, కోల్‌కతాలో రూ.90.76, చెన్నైలో 92.34 కి అందుబాటులో ఉండనుంది.

అంతకుముందు రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగించింది. రాజస్థాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో భారీ కోత విధించింది. పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్‌ను రెండు శాతం తగ్గించింది. రాజస్థాన్‌లో పెట్రోల్ ధర రూ.1.40 నుంచి రూ.5.30కి తగ్గింది. డీజిల్ ధర రూ.1.34 నుంచి రూ.4.85కి తగ్గింది.

Also Read: Malkajgiri BRS MP Candidate : మల్కాజ్‌గిరి నుంచి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి