IS Ban : ‘ఇస్లామిక్ స్టేట్’ (ఐఎస్).. ఇది కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ. దీనికి వివిధ దేశాల్లో వేర్వేరు పేర్లతో అనుబంధ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. అశాంతిని, రక్తపాతాన్ని క్రియేట్ చేయడమే ఈ ఉగ్రవాద సంస్థల లక్ష్యం. ఇలాంటి ఉగ్రవాద సంస్థలపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వాటిని కూకటివేళ్లతో ఏరిపారేస్తోంది. ఈక్రమంలోనే ఇస్లామిక్ స్టేట్, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై కొన్నేళ్ల క్రితమే భారత సర్కారు బ్యాన్ విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద వాటిని నిషేధించింది. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సంచలన పిటిషన్ దాఖలైంది. దాన్ని సఖీబ్ అబ్దుల్ హమీద్ నాచన్ అనే 64 ఏళ్ల దాఖలు చేశాడు. అది కూడా ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి. అతగాడు ప్రస్తుతం ఆ జైలులోనే ఉన్నాడు.
Also Read :Fact Check : ‘‘కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలు బోగస్’’ అని కడియం శ్రీహరి కామెంట్ చేశారా ?
మొత్తం మీద సఖీబ్ అబ్దుల్ హమీద్ నాచన్(IS Ban) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికే రెండుసార్లు సుప్రీంకోర్టు వాదనలు విన్నది. చివరిసారిగా డిసెంబరు 4న వాదనలు జరిగాయి. సఖీబ్ అబ్దుల్ హమీద్ నాచన్‌కు ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉంది. దీంతో అతడికే వాదనలు వినిపించుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. ఈ కేసులో తదుపరి వాదనలు సుప్రీంకోర్టులో జనవరి 22న జరగనున్నాయి.ఈ పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఉన్నారు. 2023 డిసెంబరులో సఖీబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. అతడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలను నమోదు చేసింది. అందుకే భారత్‌లో ఐఎస్, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలపై బ్యాన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సఖీబ్ పిటిషన్ వేశారు. ఇస్లామిక్ స్టేట్ అనే పదాలతో కూడిన ఉగ్రవాద సంస్థలపై భారత సర్కారు విధించిన నిషేధం కొన్ని సైద్ధాంతిక భావజాలాలను, మత గ్రంధం ఖురాన్‌లోని పదజాలాలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఉందని అతడు ఆరోపించాడు.
Also Read :Adani Wilmar : ‘ఫార్చూన్’ వంటనూనెల బిజినెస్.. అదానీ సంచలన నిర్ణయం
ఈ కేసులో న్యాయ కోణంలో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. దీంతో ఈ కేసులో అమికస్ క్యూరీగా ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ముక్తా గుప్తాను సుప్రీంకోర్టు నియమించింది. సఖీబ్ గతంలో నిషేధిత సంస్థ ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా’ (సిమి) జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. 2002-2003లో ముంబైలో జరిగిన మూడు బాంబు పేలుళ్ల కేసులో నాచన్ దోషిగా తేలడంతో జైలుశిక్ష పడింది. శిక్షను అనుభవించిన అనంతరం 2017 నవంబరులో జైలు నుంచి అతడు విడుదలయ్యాడు.తాజాగా 2023 డిసెంబరులో నాచన్‌ను ఎన్‌ఐఏ ఇంకోసారి అరెస్టు చేసింది.