Site icon HashtagU Telugu

Delhi Election Results : ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారు : చంద్రబాబు

People of Delhi have chosen the right party at the right time: Chandrababu

People of Delhi have chosen the right party at the right time: Chandrababu

Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..ఢిల్లీ ప్రజలు సరైన సమయంలో సరైన పార్టీని ఎన్నుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సరైన సమయంలో సరైన నాయకత్వం చాలా కీలకం. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్టే.

Read Also: Pakistan- India: ఫిబ్రవరి 23న బిగ్ ఫైట్.. భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఎవరిది పైచేయి?

పీపుల్స్ ఫస్ట్ అనే నినాదం అక్కడి ఎన్నికల్లో వర్కౌట్ అయ్యిందని, ఆ నినాదమే బీజేపీని గెలిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిందని, ఢిల్లీ నుంచి చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని అన్నారు. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలుకుతుందని చెప్పారు. ఏపీ, ఢిల్లీలో ప్రజల ఆకాంక్షలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్‌ను కాటేశారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు. తెచ్చిన పాలసీలు ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించాయో నేతలు చర్చించాలి. పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. గుజరాత్‌లో సుస్థిర పాలనతో వృద్ధి 15 రెట్లు పెరిగింది. మంచి నాయకత్వంలో ముందుకెళ్తే 2047 నాటికి మన దేశమే నంబర్‌ వన్‌ అని చంద్రబాబు అన్నారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోడీ అని చంద్రబాబు కొనియాడారు. స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్.. గుజరాత్ అభివృద్ధికి కారణం అయ్యాయని, కొందరు నేతలు సంక్షేమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని వాటిని తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారని గుర్తుచేశారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని మౌలిక వసతులు వస్తాయని అన్నారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందని వెల్లడించారు. చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్‌ తలసరి ఆదాయం పెరిగిందని స్థిరమైన పాలన, పాలసీలు, గ్రోత్‌ గుజరాత్‌ అభివృద్ధికి కారణమైందని అన్నారు. కొందరు నాయకులు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతి చేస్తున్నారని ఇంక రాజకీయాల్లో కాలుష్యం పెరుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Read Also: Cyber Fraud : కంపెనీ ఈమెయిల్‌ హ్యాక్.. 10 కోట్లు మాయం