Site icon HashtagU Telugu

Amit Shah: ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది: లోక్ సభలో అమిత్‌ షా

Amit Shah comments manipur women video

Amit Shah comments manipur women video

దేశ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని.. ప్రజల ఆకాంక్షల మేరకు అవిశ్వాసం తీసుకురాలేదని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే, ప్రజా ఆందోళనలు జరిగితే విపక్షాలు అవిశ్వాసం పెడతాయి. ప్రధాని, మంత్రుల తరఫున ఎవరికీ అవిశ్వాసం లేదు. ప్రజల్లో లేదు.. సభలోనూ అవిశ్వాసం లేదు. ఇలాంటి సమయంలో విపక్ష సభ్యులు అవిశ్వాసం తీసుకొచ్చారు. పలు ప్రాంతాల ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వంపై కొంచెం కూడా అవిశ్వాసం లేదు. ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది అని అమిత్‌ షా తెలిపారు.

పార్లమెంట్లో మణిపూర్ మంటలు చెలరేగాయి. లోక్సభలోకి అడుగుపెడుతూనే రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దాదాపు నెల రోజుల నుంచి మణిపూర్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. మణిపూర్ పై పార్లమెంట్లో చర్చ జరగాలని.. ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. కానీ ప్రధాని నుంచి మౌనమే సమాధానం ఎదురైంది. దీంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని అస్త్రంగా ఎంచుకున్నాయి. దానిపైనే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చ ప్రారంభమైంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ రీ ఎంట్రీ ఇచ్చారు. సూటిగా, సుత్తి లేకుండా కేంద్ర ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు.

కాగా లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో కాకినాడ పార్ల‌మెంటు స‌భ్యురాలు బీశెట్టి వెంక‌ట‌స‌త్య‌వ‌తి మాట్లాడుతూ.. అరుదైన భూ ఖ‌నిజాల గుర్తింపు, కొబాల్ట్‌, లిథియం, నికెల్ వంటి ఖ‌నిజాల వినియోగంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో తెల‌పాల‌ని స్పీక‌ర్ ఓం బిల్లా ద్వారా ప్ర‌ధానిని కోరుతున్న‌ట్టు తెలిపారు. ఈ ప్ర‌శ్న‌కు స్పందించిన ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య స‌హాయ మంత్రి డాక్ట‌ర్ జితేంద‌ర్ సింగ్.. అరుదైన భూ ఖ‌నిజాల వినియోగాన్ని పెంచేందుకు అంత‌రిక్ష ప్ర‌యోగాల‌ను వినియోగించుకునేలా ప్ర‌ధాన మంత్రి శ‌ద్ధ తీసుకుంటున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ‌-ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. అరుదైన భూ ఖ‌నిజాల నిర్వ‌హ‌ణ‌, గుర్తింపున‌కు సంబంధించి నిధుల కేటాయింపుపైనా దృష్టి పెట్టామ‌ని చెప్పారు. అణుశ‌క్తి విభాగం ఆధ్వ‌ర్యంలో జాయింట్ వెంచ‌ర్ ద్వారా ఖ‌నిజాల గుర్తింపు, వినియోగంపై దృష్టి పెట్టామ‌న్నారు.