Site icon HashtagU Telugu

Great Tribute : తుది వీడ్కోలు కోసం బారులు తీరిన తమిళులు!

Bipin

Bipin

హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సైనిక వీరులకు దేశవ్యాప్తంగా పలుచోట్లా పెద్ద నివాళులు అర్పించారు. ప్రధాన మోడీతో సహ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సైనికాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ భౌతికకాయానికి తమిళనాడులో భావోద్వేగ పూరితంగా ప్రజలు వీడ్కోలు పలికారు.  ఈ మార్గంలో మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి భౌతికకాయాలు తరలిస్తోన్న అంబులెన్స్ లపై పూలుచల్లి నివాళులర్పించారు. ‘భారత్‌మాతాకీ జై’, ‘వీర వణక్కం.. వీర వణక్కం’ (వీరుడుకి వందనాలు) అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రావత్ తో పాటు ఆయ‌న భార్య మధులికా రావత్ అంత్యక్రియలు కాసేప‌ట్లో జ‌ర‌గ‌నున్నాయి. ఢిల్లీలోని కంటోన్మెంట్ శ్మశాన వాటికకు వారి మృత‌దేహాల‌ను త‌ర‌లించ‌నున్నారు. నిన్న‌ సాయంత్రం వారి భౌతిక కాయాలను త‌మిళ‌నాడు నుంచి సైనిక విమానంలో ఢిల్లీకి తరలించిన విష‌యం తెలిసిందే.

Exit mobile version