Pench Tiger:16 ఏళ్ల పెంచ్ ఫేమస్ టైగర్ కాల‌ర్ వాలి మృతి

మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్ లో ఫేమస్ కాల‌ర్ వాలి 16 సంవత్సరాల వయస్సులో శనివారం సాయంత్రం మరణించింది.

  • Written By:
  • Updated On - January 16, 2022 / 10:30 PM IST

మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్ లో ఫేమస్ కాల‌ర్ వాలి 16 సంవత్సరాల వయస్సులో శనివారం సాయంత్రం మరణించింది. గత కొద్దిరోజులుగా పులిపై నిఘా ఉంచామని, వృద్ధాప్యం కారణంగా పులి చనిపోయినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ అలోక్ కుమార్ తెలిపారు. పులి మృతి కి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం చేసిన తరువాత తెలుస్తుందన్నారు.

కాల‌ర్ వాలిని టీ 15 అని కూడా పిలుస్తారు. అయితే చివ‌రిగా ఈ కాల‌ర్ వాలి జ‌న‌వ‌రి 14న భూరాదేవ్ న‌ల్లా వ‌ద్ద నీరు త్రాగ‌డానికి వ‌చ్చింద‌ని వ‌న్య‌ప్రాణి ఫోటోగ్రాఫ‌ర్ ఓం వీర్ తెలిపారు. ఆ స‌మ‌యంలో పులి చాలా బలహీనంగా ఉందని.. నడవలేకపోయిందని ఆయ‌న తెలిపారు. నీరు త్రాగి అక్క‌డు విశ్రాంతి తీసుకుంద‌ని.. సుమారు 2 గంటలు కదలకుండా అలాగే ఉంద‌ని ఓం వీర్ తెలిపారు. ఆస‌మ‌యంలో పెంచ్ లోపల 42 వాహనాలు ఉన్నాయని.. వారందరూ పులిని చూశారని వీర్ తెలిపారు.అయితే పులి బ‌ల‌హీనంగా న‌డ‌వ‌లేని స్థితిలో ఉండ‌టంతో వెంట‌నే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని రోడ్లను మూసివేశారు. పులిని అక్క‌డి నుంచి త‌ర‌లించి చికిత్స అందించారు. చికిత్స‌ పొందుతూ శనివారం సాయంత్రం 6:15 గంటలకు పులి తుది శ్వాస విడిచింది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం T-15 సెప్టెంబరు 22, 2005న పులి T-1కి జన్మించింది. దీనిని ‘ఛార్జర్’ అని పిలుస్తారు.

పులుల మధ్య సంతానోత్పత్తి, పిల్లల పెంపకాన్ని అధ్యయనం చేయడానికి కాల‌ర్ వాలిని ఏడేళ్లుగా పరిశీలించారని ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ అనిరుద్ మజుందార్ తెలిపారు. పులి సాధారణంగా 12 సంవత్సరాలకు మించి జీవించదని మజుందార్ తెలిపారుజ‌. ఎందుకంటే వాటికి తమ భూభాగాన్ని రక్షించుకోవడం కష్టమవుతుందని .. అయితే కాల‌ర్ వాలి విషయానికి వస్తే పెంచ్‌లోని కోర్ జోన్‌లోని వేట అధికంగా ఉండే స్థావరంపై ఆధిపత్యం చెలాయించిందని ఆయ‌న తెలిపారు. కొన్నేళ్లుగా, కాల‌ర్ వాలి 29 పిల్లలకు జన్మనిచ్చింది, వాటిలో 25 విజయవంతంగా బయటపడ్డాయి. “పన్నా టైగర్ రిజర్వ్‌కు తరలించబడిన తన పిల్లలో ఒకటైన పులి కూడా ఒకే లిట్టర్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చినందున కాలర్‌వాలి యొక్క కీర్తి ఇప్పటికీ జీవించి ఉంది. కాల‌ర్ వాలి చెందిన ఇతర మగ పిల్లలు ఇప్పుడు పెంచ్ ,దాని పరిసర ప్రాంతం మహారాష్ట్రలో కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.