Paytm Update : తగ్గేదేలే అంటున్న పేటీఎం.. ఏం చేయబోతుందో తెలుసా ?

Paytm Update : తన బ్యాంకింగ్ యూనిట్ 'పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌' తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ పేటీఎం పెద్ద సాహసమే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

  • Written By:
  • Updated On - February 9, 2024 / 03:51 PM IST

Paytm Update : తన బ్యాంకింగ్ యూనిట్ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ పేటీఎం పెద్ద సాహసమే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  బెంగుళూరు కేంద్రంగా పని చేసే ఈ-కామర్స్ స్టార్టప్ ‘బిట్సిలా’ను కొనేందుకు పేటీఎం చర్చలు జరుపుతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) విభాగంలో పనిచేస్తున్న ఇంటర్‌ ఆపరబుల్ ఈ-కామర్స్ స్టార్టప్ కంపెనీ ‘బిట్సిలా’. తమ ఈ-కామర్స్ వ్యాపారాన్ని విస్తరించేందుకు బిట్సిలా పనికొస్తుందని పేటీఎం యాజమాన్యం భావిస్తోంది.పేటీఎం కూడా 2022 సంవత్సరం ONDC విభాగంలో సేవలను అందిస్తోంది. ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో యాప్‌ను ఇంటిగ్రేట్ చేసిన మొదటి పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం పేటీఎం సేవలు బయ్యర్‌ యాప్ రూపంలో ONDC విభాగంలో అందుబాటులో ఉన్నాయి. తాము బిట్సిలాను కొనుగోలు చేయనున్నామంటూ మీడియాలో వస్తున్న వార్తలను పేటీఎం ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది.  మరోవైపు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి తాజాగా లభించిన అనుమతి మేరకు  Paytm ఈ-కామర్స్ దాని పేరును Pai ప్లాట్‌ఫామ్‌లుగా(Paytm Update) మార్చింది. పేరు మార్పు కోసం మూడు నెలల క్రితమే పేటీఎం దరఖాస్తు చేసింది. దీనిపై ఫిబ్రవరి 8న కంపెనీల రిజిస్ట్రార్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join

బిట్సిలా కంపెనీ ఏం చేస్తుంది ?

లావాదేవీల పరంగా చూస్తే..  ఓఎన్‌డీసీ విభాగంలో సెల్లర్స్‌ తరపున వ్యవహరిస్తున్న మూడో అతి పెద్ద కంపెనీ ఇదే. వచ్చే వారంలోగా బిట్సిలా.. పేటీఎం చేతికి వస్తుందని అంచనా వేస్తున్నారు. దాశరథం బిట్ల, సూర్య పోకల్లి కలిసి ఈ స్టార్టప్‌ను 2020లో  ప్రారంభించారు. అంట్లర్ ఇండియా, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామా నుంచి ప్రీ-సీడ్ రౌండ్‌లో ఈ కంపెనీ నిధులు సేకరించింది. సెల్లర్‌ సైడ్‌ యాప్‌ను బిట్సిలా నడుపుతోంది. బిజినెస్-టు-బిజినెస్ విభాగంలో పని చేసే ఈ కంపెనీ, ONDC విభాగంలో చిన్న వ్యాపారులకు సాయం చేస్తుంటుంది.

Also Read :Bharat Ratna PV : మన పీవీ.. తెలుగుజాతి ఠీవీ.. నర్సింహారావు జీవిత విశేషాలివీ

ఈపీఎఫ్ ఖాతాల్లోకి డిపాజిట్లు, క్రెడిట్లు బ్లాక్

ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకుతో లింక్ చేసిన ఈపీఎఫ్ ఖాతాల్లోకి డిపాజిట్లు, క్రెడిట్లను బ్లాక్ చేయనున్నట్టు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్) ఖాతాలకు సంబంధించిన క్లెయిమ్‌లను అంగీకరించవచ్చని ఈపీఎఫ్ఓ తన ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈపీఎఫ్ఓ ఖాతాలతో లింక్ అయిన చందరాదారులు క్లెయిమ్స్‌ను అనుమతించవద్దని, ఈ నిర్ణయం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని నోటీసుల్లో పేర్కొంది. గతేడాదే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుల నుంచి ఈపీఎఫ్ పేమెంట్లకు అనుమతిస్తూ ఈపీఎఫ్ఓ ఆదేశాలిచ్చింది. ఇంతలోనే అనుమతులను రద్దు చేస్తూ ప్రకటించడం గమనార్హం.