Site icon HashtagU Telugu

Salman Khan : ‘2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపు

Death Threat To Salman Khan

Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరో హత్య బెదిరింపు వచ్చింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఈ మెసేజ్ అందింది. సల్మాన్ ఖాన్ ప్రాణాలు నిలవాలంటే రూ.2 కోట్లు తమకు చెల్లించాలని సదరు వ్యక్తి డిమాండ్ చేశాడు. ఒకవేళ ఈ డబ్బులు అందకుంటే.. సల్మాన్‌ను చంపేస్తామని ఆ దుండగుడు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ముంబైలోని వర్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :Amit Shah : ఖలిస్తానీల హత్యలు.. హోంమంత్రి అమిత్‌షా‌పై కెనడా సంచలన ఆరోపణలు

వారం క్రితం కూడా ఇదే విధంగా సల్మాన్ ఖాన్‌ను(Salman Khan) హెచ్చరిస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ నంబరుకు  ఒక మెసేజ్ వచ్చింది. అప్పట్లోనూ విచారణ నిర్వహించిన ముంబైలోని వర్లీ పోలీసులు.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అతడు కూరగాయల వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ యువకుడికి లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌‌తో సంబంధం ఉందా ? లేదా ? అనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈక్రమంలో అలాంటిదే మరో వార్నింగ్ మెసేజ్.. ముంబై ట్రాఫిక్ పోలీసులకు అందడం గమనార్హం. మొత్తం మీద సల్మాన్‌ఖాన్‌ను బెదిరిస్తూ వస్తున్న వరుస మెసేజ్‌లు ముంబై పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. ఈక్రమంలో సల్మాన్‌ఖాన్‌కు భారీగా భద్రతను పెంచారు.

Also Read :Nishad Yusuf : ‘కంగువ’ ఎడిటర్‌ నిషాద్ ఇక లేరు.. అనుమానాస్పద స్థితిలో మృతి

ఇటీవలే ముంబైలో మాజీ మంత్రి బాబా సిద్దిఖీ (ఎన్‌సీపీ- అజిత్) హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. బాబా సిద్ధిఖీ హత్యకేసులో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో మంగళవారం రోజు బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీకి బెదిరింపు కాల్ వచ్చింది.  నోయిడాలోని సెక్టార్ 39 ఏరియాకు చెందిన 20 ఏళ్ల గుర్ఫాన్ ఖాన్ అలియాస్ మహ్మద్ తయ్యబ్ ఈ కాల్ చేశాడని పోలీసులు గుర్తించారు. వెంటనే సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. జీషాన్‌కు కాల్ చేసిన ఈ దుండగుడు.. సల్మాన్ ఖాన్ నుంచి కూడా తమకు ముడుపులు ఇప్పించాలని అడిగాడు.