శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని , సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన ఆవిర్భవించాయని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం(Maharashtra Election campaign)లో భాగంగా ఈరోజు , రేపు పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మహాయుతి తరఫున మహారాష్ట్రలోని డెగ్లూర్లో (Deglur ) పవన్ కళ్యాణ్ ప్రచారం చేసారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత.. జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందని, అద్భుత అయోధ్య నిర్మాణం సాధ్యమైందని, నలువైపుల నూతన రోడ్లు నిర్మాణమవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు.
అలాగే బీజేపీ హాయలోనే దేశంలోని రైతులు, పారిశ్రామిక వేత్తలకు అందుతున్న ప్రయోజనాల్ని పేర్కొన్నారు. సనాతన ధర్మం కోసం నిజ జీవితంలో పోరాడడం అనేది సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను చేయడంలా తేలికగా ఉండదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర దేవాలయాలు, సంస్కృతి, భాష భద్రంగా ఉండటానికి శివాజీ చేసిన కృషిని పవన్ గుర్తుచేశారు. శివాజీ నేలపై బెదిరింపులకు తాము భయపడమని స్పష్టంగా హెచ్చరించారు. మహాయుతి కూటమికి వ్యతిరేకంగా అఘాడీ కూటమిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివసేనా వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే.. దేశాన్ని రక్షించేందుకు, బలమైన దేశ నిర్మాణానికి కృషి చేశారని పొగడ్తలు కురిపించారు. మనమంతా విడిపోయి బలహీన పడిపోదామా.? కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర లక్షకోట్ల ఆర్థిక వ్యవస్థ కోసం మహాయుతి కూటమి ప్రయత్నిస్తోందన్న పవన్ కళ్యాణ్.. అందుకు మద్ధతుగా నిలవాలని . మన దేశం కోసం, మన ధర్మం కోసం నిలబడాలంటూ కార్యకర్తక దిశానిర్దేశం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మరాఠి సంస్కృతి కోసం, మరాఠి భాష కోసం ప్రజలంతా మహాయుతి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.
Read Also : Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి