Site icon HashtagU Telugu

NDA Meeting : మీరు ప్రధానిగా ఉన్నంత కాలం ఈ దేశం ఎవరికీ తలవంచదు – పవన్

Pawan Speech Nda

Pawan Speech Nda

మోడీ మద్దతుతో ఏపీలో NDA కూటమి 91% స్థానాలు కైవసం చేసుకుందని , మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం ఈ దేశం ఎవరికీ తలవంచదు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే 3.0 కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నితీష్‌ సహా 9 మంది ఎన్డీయే మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘జనసేన తరఫున ప్రధాని మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోదీ భారతదేశానికి ప్రధానిగా ఉన్నంత వరకూ ఏ దేశానికీ తలొగ్గే పరిస్థితి రాదు. మోదీ నేతృత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం.’ అని పవన్ పేర్కొన్నారు. మీ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉంది. మీ పనులు, అభివృద్ధితో దేశంలోని ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించారు. స్ఫూర్తిని నింపారు. మీ మద్దతుతో ఏపీలో భారీ మెజారిటీతో గెలిచాం. జనసేన తరఫున మిమ్మల్ని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నేతగా బలపరుస్తున్నా’ అని పవన్ పేర్కొన్నారు.

Read Also :NDA Government Formation : ‘ఇక్కడ కూర్చుంది పవన్ కాదు.. తుఫాన్’ – మోడీ