Site icon HashtagU Telugu

Pawan Kalyan : మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Pawan Modi

Pawan Modi

గుజరాత్ ముఖ్యమంత్రి గా మోదీ (Modi) ప్రమాణం చేసి నేటికి 23ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇదే రోజున మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. విప్లవాత్మక నిర్ణయాలతో కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చడం ఆ రోజుతోనే మొదలైందని , ఆయన నాయకత్వంలో మన దేశం విశ్వవ్యాప్తంగా కీర్తిని పొంది.. అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. త్వరలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజా సేవ కంటే మరేది ముఖ్యం కాదని మోడీ నిరూపించారని పేర్కొన్నారు.

భారత దేశ వైవిధ్యతతను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు ప్రజలతో కలిసిపోగలిగే లక్షణాలు.. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు మార్పు తీసుకురావడంలో సహాయం చేశాయని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వం దేశాన్ని పురోగమించే దిశగా తీసుకెళ్లడంతో పాటు.. అనేక మంది జీవితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఆయన వేసిన పునాదులతో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశాన్ని చూస్తామని అభిప్రాయపడ్డారు.

మరోపక్క అమిత్ షా సైతం ట్విట్టర్ వేదికగా మోడీకి శుభాకాంక్షలు అందజేశారు. ‘2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 13 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా సోమవారంతో 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణమే, ప్రజా సేవ కోసం ఒక వ్యక్తి తన జీవిత మొత్తాన్ని ఎలా అంకితం చేయగలరనే విషయానికి ప్రతీక. ఆయన రాజకీయ ప్రయాణంలో నిరంతరం హోంమంత్రిగా తోడుగా ఉండటం నా అదృష్టం. పేదల సంక్షేమం, భద్రత, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎలా పని చేయాలో ప్రధాని మోడీ చూపించారు. 23 ఏళ్లుగా నిరాటంకంగా, అలసిపోకుండా, తనను తాను పట్టించుకోకుండా దేశానికి, ప్రజల సేవకే అంకితం ఇచ్చారు’ అని అమిత్​ షా ఎక్స్​ వేదికగా కొనియాడారు.

Read Also : KA Paul- Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై 14 సెక్ష‌న్ల కింద‌ కేఏ పాల్ ఫిర్యాదు