Site icon HashtagU Telugu

Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపడం ఫై జనసేనధినేత హర్షం

Women's Reservation Bill

pawan kalyan about women's reservation bill

మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు మోడీ మంత్రివర్గం (Modi Cabinet) ఆమోదం తెలుపడం ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేసారు. నిన్న సోమవారం నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు సమావేశం పార్లమెంట్‌ పాత భవనంలో జరిగింది. ఈరోజు నుండి కొత్త పార్లమెంట్ లో సమావేశాలు మొదలయ్యాయి.

కాగా, సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ మంత్రివర్గం సమావేశమై మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం ఫై యావత్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ బిల్లు ఫై స్పందించారు.

చట్టసభల్లో మహిళా మణుల ప్రాతినిధ్యం పెంచాలని చూడడం చాల సంతోషంగా ఉందన్నారు. వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని , ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని పవన్ తెలిపారు. చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధాన మంత్రి మోడీ హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నానన్నారు. చట్ట సభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసే ఈ బిల్లు విషయమై వాగ్దానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో ప్రధానిమోడీ ఎంతో చిత్తశుద్ధి చూపారని చెప్పుకొచ్చారు. ఈ బిల్లు చట్ట సభల్లోనూ ఆమోదం పొందితే కచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యం అవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా రక్షణ, విద్య, వైద్యం లాంటి అంశాల్లో మహిళా ప్రతినిధులు విలువైన చర్చలు చేయగలరని వ్యాఖ్యానించారు.

Read Also : Mobile Phone : ఉదయం లేవగానే ఫోన్ చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?