జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్నారు. నిన్నటి నుండి బిజెపి అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తూ వస్తున్నారు. పవన్ పర్యటనకు ప్రజలు బ్రహ్మ రథంపడుతున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి..నేషనల్ వైడ్ నేతలు షాక్ కు గురి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అనుకుంటే..మహారాష్ట్ర లో కూడా పవన్ క్రేజ్ పిక్ స్టేజ్ లో ఉంది కదా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. డెగ్లూర్, నాందేడ్ వంటి ప్రాంతాల్లో పవన్ సభలకు, ర్యాలీ లకు విశేష స్పందన లభించింది. షోలాపూర్ నగరంలో పవన్ కళ్యాణ్ రోడ్ షోకు ప్రజలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. డీజే పాటలు, బ్యాండ్ కోలాహలం నడుమ అట్టహాసంగా పవన్ రోడ్ షో సాగింది.
కాగా పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో ‘జై తెలంగాణ’ (Jai Telangana) నినాదంతో హోరెత్తించారు. ఆయన పర్యటించిన ప్రాంతాల్లో తెలంగాణ వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో ‘జై తెలంగాణ’ అంటూ వారిలో జోష్ నింపారు. “మీ అందరిలో చాలా మంది పక్కనే ఉన్న తెలంగాణ నుంచి వచ్చారు. జై తెలంగాణ. మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో… నాకు ఇష్టమైన పాట మీకు తెలుసుకదా! బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి… ఏ బండి వెనుక పోతవ్ కొడకో నైజాము సర్కారోడ… అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు. మీరు మహారాష్ట్రలో ఉన్నా తెలంగాణ పోరాట స్ఫూర్తితో గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకొన్నారు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది..ఇక్కడ కూడా అంతే” అంటూ కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు.
Read Also : Nara Ramamurthy Naidu Funerals : అధికార లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తి