Site icon HashtagU Telugu

MP Preneet Kaur: కాంగ్రెస్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ

MP Preneet Kaur

MP Preneet Kaur

MP Preneet Kaur: పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె అధికారిక లేఖ ద్వారా వెల్లడించారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు. ఎంపీ ప్రణీత్ కౌర్ రాజీనామాతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టైంది.

ప్రణీత్ కౌర్ కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య. పంజాబ్‌లోని ‘రాయల్ సీట్’ అయిన పాటియాలా నుండి ఆమె నాలుగు సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు. కౌర్ గత 25 ఏళ్లుగా పాటియాలా లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పాటియాలా నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ఆప్ పార్టీ ఇవాళ విడుదల చేసింది. పాటియాలా నుంచి ఆప్ అభ్యర్థి బల్వీర్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బల్వీర్‌తో ప్రణీత్ కౌర్ పోటీపడనుంది.

ఆమె మాట్లాడుతూ… నేను ప్రధాని మోడీ నాయకత్వంలో నా నియోజకవర్గం, నా రాష్ట్రం మరియు దేశం కోసం పని చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాను. బిజెపితో నా రాజకీయ జీవితం మరింత మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను అని ఆమె చెప్పారు.

Also Read: Ferocious Dogs : ప్ర‌మాద‌క‌ర జాతి శున‌కాల జాబితా విడుదల చేసిన కేంద్రం