విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు సాధారణ వీసా/ఈ-వీసా పొడిగింపు, ఓవర్ స్టే పెనాల్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించడమైనది.

Published By: HashtagU Telugu Desk
Passport Visa New Rule

Passport Visa New Rule

Passport Visa New Rule: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల నేపథ్యంలో ఏర్పడిన ప్రపంచ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఒక పెద్ద మానవీయ నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు భారీ ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం వారి వీసా గడువును 30 రోజుల పాటు పొడిగించింది. అంతేకాకుండా ప్రయాణ ఆంక్షల కారణంగా నిర్ణీత గడువు కంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చినందుకు విధించే ఓవర్ స్టే పెనాల్టీని కూడా ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది.

దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన నోటీసు ప్రకారం.. ఈ-వీసా (e-Visa) లేదా సాధారణ వీసా గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న విదేశీ పౌరులకు ఉచితంగా 30 రోజుల గడువు పొడిగింపు ఇవ్వబడుతుంది. ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న పోరాటం కారణంగా నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం భారత్‌లో ఉన్న విదేశీ పౌరుల నుండి ఎటువంటి ఓవర్ స్టే పెనాల్టీ వసూలు చేయ‌దు. అంతర్జాతీయ విమాన మార్గాలు తిరిగి పునరుద్ధరించబడిన వెంటనే, ప్రభావిత విదేశీ పౌరులు సురక్షితంగా తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ఎటువంటి రుసుము లేకుండా ఎగ్జిట్ పర్మిట్లు జారీ చేయబడతాయి. సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా ఎగ్జిట్ పర్మిట్ లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోలేకపోతే దానిని వలస చట్టాల ఉల్లంఘనగా పరిగణించబోమని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

అధికారుల ప్రకటన

పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు సాధారణ వీసా/ఈ-వీసా పొడిగింపు, ఓవర్ స్టే పెనాల్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించడమైనది. దీనివల్ల వారు ఈ క్లిష్ట సమయంలో చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య అంతర్జాతీయ స్థాయిలో భారత్ సాఫ్ట్ పవర్‌, మానవీయ దృక్పథాన్ని చాటిచెబుతోంది. యుద్ధ భయంతో అనిశ్చితిలో ఉన్న వేలాది మంది విదేశీ పౌరులకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది.

  Last Updated: 14 Mar 2026, 02:23 PM IST