Passport Verification: నేటి నుంచి కొత్త పాస్‌పోర్ట్ రూల్.. ఇకపై డిజిలాకర్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్..!

అంతర్జాతీయ ప్రయాణాల కోసం పాస్‌పోర్ట్ (Passport Verification) దరఖాస్తు ప్రక్రియలో పెద్ద మార్పు కనిపిస్తుంది. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఇప్పుడు ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ డిజిలాకర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Passport Rule

Passport Rule

Passport Verification: అంతర్జాతీయ ప్రయాణాల కోసం పాస్‌పోర్ట్ (Passport Verification) దరఖాస్తు ప్రక్రియలో పెద్ద మార్పు కనిపిస్తుంది. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఇప్పుడు ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ డిజిలాకర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిలాకర్ ఉపయోగించి అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ passportindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫికెట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు

దరఖాస్తుదారులు తమ పత్రాలను అప్‌లోడ్ చేయడానికి డిజిలాకర్‌ను ఉపయోగిస్తే దరఖాస్తు ప్రక్రియ సమయంలో వారు ఎటువంటి పత్రాల హార్డ్ కాపీలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. ఈ దశ ప్రాసెసింగ్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు.

ఈ నిబంధన ఎందుకు తీసుకొచ్చారు..?

దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియలో డిజిలాకర్ ప్రవేశపెట్టబడింది. అదే సమయంలో భౌతిక పత్రాల ధృవీకరణ అవసరాన్ని తగ్గించడానికి వివిధ ప్రాంతాలలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (POPSK) అమలు చేయబడ్డాయి.

డిజిలాకర్ అంటే ఏమిటి?

DigiLocker అనేది భారతీయ ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ అందించిన డిజిటల్ వాలెట్ సేవ. దీని కింద వినియోగదారులు ప్రభుత్వం జారీ చేసిన అన్ని పత్రాలను సురక్షితమైన పద్ధతిలో సేకరించి ఉంచుకోవచ్చు. అవసరమైనప్పుడు వాటిని యాక్సెస్ చేయవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ మార్క్‌షీట్, ఇతర పత్రాలను డిజిలాకర్ లో చూసుకోవచ్చు.

Also Read: Cyber Criminals: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, 3000 మందిపై కేసులు బుక్

ఆధార్ నుంచి పాస్‌పోర్ట్ వరకు ఉంచుకోవచ్చు

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ కోసం డిజిలాకర్ ద్వారా ఆధార్ పత్రాలను ఉపయోగించడానికి మంత్రిత్వ శాఖ ఇప్పుడు అనుమతించింది. డిజిలాకర్‌లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డును సురక్షితంగా ఉంచవచ్చు.

DigiLocker ఎలా ఉపయోగించాలి?

డిజిలాకర్ ఖాతాను తెరవడానికి వినియోగదారులు మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. మీ నంబర్ ఇప్పటికే ఆధార్‌కు లింక్ చేయబడి ఉండాలి. డిజిలాకర్ ఖాతాకు లాగిన్ అయినప్పుడు వినియోగదారులు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌కోడ్ (OTP) వస్తుంది. మరోవైపు, మీరు డిజిలాకర్‌లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే మీరు ఆధార్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.

  Last Updated: 05 Aug 2023, 02:25 PM IST