Delhi Election Results : బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా స్పష్టమైన ఆధిక్యం నెలకొల్పింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 47 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపుతో దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కాషాయ జెండా ఎగరబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తరఫున సీఎం రేసులో ఉన్న పర్వేశ్ వర్మ .. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. సీఎం పదవిపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో సీఎం పదవికి పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Delhi Election Results : కేజ్రీవాల్ ఓటమి పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
కాగా, ఢిల్లీలో బీజేపీ విజయం తర్వాత సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ తదుపరి ఢిల్లీ షీఎం అవుతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఆయనే ముందు వరసలో ఉన్నారు. మాజీ సీఎం సాహెబ్ సింగ్ కుమారుడిగా పర్వేష్ వర్మకు మంచి పేరుంది.
ఇక, న్యూ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన పర్వేశ్ వర్మ.. ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీపై గెలుపొందారు. పర్వేశ్ వర్మ పేరు సీఎం రేసులో ముందంజలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు అనంతరం ఆయన అమిత్ షాను కలవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.