Footbridge Collapses: కుప్పకూలిన రైల్వే ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి.. 8 మంది పరిస్థితి విషమం

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో బల్లార్షా రైల్వే స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జి చాలా భాగం కూలిపోవడంతో పెను ప్రమాదం జరిగింది.

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 07:18 PM IST

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో బల్లార్షా రైల్వే స్టేషన్‌లోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జి చాలా భాగం కూలిపోవడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఉన్న వ్యక్తులు 60 అడుగుల ఎత్తు నుంచి పట్టాలపై పడిపోయారు. అయితే ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 20 మంది గాయపడగా, 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. బల్లార్షా రైల్వే స్టేషన్‌లో కాజీపేట్- పూణే ఎక్స్‌ప్రెస్‌ను అందుకోవడానికి చాలా మంది ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి ప్లాట్‌ఫారమ్ నంబర్ 4కి వెళ్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఈ వంతెనలో కొంత భాగం కూలిపోయింది. బ్రిడ్జి ఎత్తు 60 అడుగులు అని, ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 80 మంది వంతెనపై ఉన్నట్లు సమాచారం. అయితే, గాయపడిన ఈ ప్రయాణికులందరికీ స్టేషన్ అధికారులు, సిబ్బంది సహాయం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.