Site icon HashtagU Telugu

Parliament Session : 4 నుంచి పార్లమెంటు సెషన్.. ప్రవేశపెట్టనున్న 19 బిల్లులివే

Parliament Session

Parliament Session

Parliament Session : డిసెంబరు 4 (సోమవారం) నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 22 వరకు కొనసాగనున్న ఈ సమావేశాల ఎజెండాపై చర్చించేందుకు అఖిలపక్ష నేతలు శనివారం పార్లమెంటులో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ , కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్ , గౌరవ్ గొగోయ్ , ప్రమోద్ తివారీ, తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ, ఎన్సీపీ నేత ఫౌజియా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా డిసెంబర్ 4 నుంచి 22 మధ్యకాలంలో 15 సమావేశాలు జరుగుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

పార్లమెంటు సెషన్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులు

1. ద రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు – 2023 (లోక్‌సభ ఆమోదించిన విధంగా)

2. ద అడ్వకేట్స్ (సవరణ) బిల్లు – 2023 (రాజ్యసభ ఆమోదించింది)

3. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు – 2023 (రాజ్యసభ ఆమోదించింది)

4. రాజ్యాంగం (జమ్మూ కాశ్మీర్) షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ (సవరణ) బిల్లు – 2023

5. రాజ్యాంగం (జమ్మూ మరియు కాశ్మీర్) షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ (సవరణ) బిల్లు – 2023

6. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు- 2023

7. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు – 2023

8. భారతీయ న్యాయ సంహిత- 2023

9. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత – 2023

10. భారతీయ సాక్ష్యా అధినియం- 2023

11. పోస్ట్ ఆఫీస్ బిల్లు- 2023

12. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, షరతులు

సర్వీస్ మరియు పదవీకాలం) బిల్లు – 2023

13. బాయిలర్స్ బిల్లు – 2023

14. తాత్కాలిక పన్నుల సేకరణ బిల్లు – 2023

15. కేంద్ర వస్తువులు, సేవల పన్ను (రెండో సవరణ) బిల్లు – 2023

16. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు – 2023

17. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు – 2023

18. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ లాస్ (ప్రత్యేక నిబంధనలు) రెండో (సవరణ) బిల్లు –  2023

19. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు – 2023

పార్లమెంటు ఫైనాన్షియల్ బిజినెస్

మహువా మొయిత్రా బహిష్కరణపై నివేదిక

తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు పుచ్చుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారు. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిపై సోమవారం లోక్ సభలో చర్చ, ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. విచారణ కమిటీ సిఫార్సుకు మద్దతు ఇస్తూ  లోక్‌సభ లో ఓటింగ్ జరిగితే.. మహువాపై బహిష్కరణ వేటుపడే అవకాశం(Parliament Session) ఉంటుంది.

Also Read: Kitchen Tips : టమాటాను ఎక్కువ కాలం నిల్వ చేసే టిప్స్