Site icon HashtagU Telugu

PhonePe & Google Pay: ఫోన్ పే, గూగుల్ పేల‌కు బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా.. ప్ర‌భుత్వం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందో..?

PhonePe & Google Pay

Paytm Vs Phonepe

PhonePe & Google Pay: దేశంలోని UPI లావాదేవీలలో ఫోన్ పే, గూగుల్ పే (PhonePe & Google Pay) వంటి యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దేశంలోని డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో ఈ కంపెనీలకు 83 శాతం వాటా ఉంది. ఈ రెండు ఫిన్‌టెక్ కంపెనీల యాజమాన్య హక్కులు విదేశీ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కంపెనీలకు సవాల్‌ ఎదురవుతుంది. డిజిటల్ చెల్లింపుల రంగంలో దేశీయ ఫిన్‌టెక్ కంపెనీలకు మద్దతు ఇవ్వాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

విదేశీ కంపెనీల యాజమాన్య హక్కులపై ఆందోళన

పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో విదేశీ కంపెనీలకు చెందిన డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌లపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ యాప్‌లకు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని కమిటీ పేర్కొంది. అలాగే స్థానిక సంస్థలకు ఈ రంగంలో పురోగమించే అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసింది. Paytm పేమెంట్స్ బ్యాంక్ RBI నుండి కఠినమైన చర్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ కమిటీ 58 పేజీల నివేదిక వచ్చింది. పేటీఎం బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో పేటీఎం ముందు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

Also Read: Transgender Ticket Inspector: తొలి రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా హిజ్రా

BHIM UPI పరిస్థితి దారుణంగా ఉంది

పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం.. నవంబర్ 2023 వరకు UPI మార్కెట్‌లో PhonePeకి 46.91 శాతం వాటా ఉంది. Google Pay కూడా 36.39 శాతం వాటాతో రెండవ స్థానంలో స్థిరంగా ఉంది. దేశంలో అభివృద్ధి చెందిన BHIM UPIకి కేవలం 0.22 శాతం మార్కెట్ వాటా మాత్రమే ఉంది.

We’re now on WhatsApp : Click to Join

మార్కెట్ వాటా పరిమితి 30 శాతం ఉండాలి

యుపిఐ చెల్లింపుల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) కూడా ఈ ఆధిపత్యంపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. మార్కెట్ వాటా గరిష్ట పరిమితిని 30 శాతానికి పెంచాలని ఎన్‌పీసీఐ కోరుతోంది. మొదటిసారిగా NPCI 2020లో ఈ ప్రయత్నం చేసింది. ఫిన్‌టెక్ రంగంలో కూడా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలని కోరుతోంది.