Site icon HashtagU Telugu

Love Marriages: ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి: సీఎం భూపేంద్ర పటేల్

Love Marriages

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Love Marriages: గుజరాత్ లో ప్రేమ వివాహాలకు (Love Marriages) తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రేమ పెళ్లిలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా వీలైతే ప్రేమ వివాహాల్లో తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి చేసే అంశాన్ని తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని సీఎం పటేల్ చెప్పారు. ప్రేమ వివాహానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని పటీదార్‌ సామాజికవర్గంలోని ఒక వర్గం డిమాండ్‌ చేయడంతో సీఎం భూపేంద్ర పటేల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: Yuvagalam : యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం

ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే సీఎంకు మద్దతు పలికారు

రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే దీనిపై అధ్యయనం చేసి మెరుగైన ఫలితాలు వచ్చేలా చూస్తామని సీఎం భూపేంద్ర పటేల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం అలాంటి చట్టం తెస్తే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ‘అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం అలాంటి చట్టాన్ని తీసుకువస్తే.. నేను ప్రభుత్వానికి మద్దతిస్తాను’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేదావాలా అన్నారు.

2021లో బిజెపి ప్రభుత్వం గుజరాత్ మత స్వేచ్ఛా చట్టాన్ని సవరించిందని, అందులో వివాహం ద్వారా బలవంతంగా, మోసపూరితంగా మారడం శిక్షార్హమైన నేరంగా ప్రకటించబడింది. ఇందులో 10 ఏళ్ల శిక్ష విధించే నిబంధన ఉంది. అయితే ఈ చట్టంలోని వివాదాస్పద సెక్షన్‌పై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.