Paper Leak: బీహార్‌లో ప్రశ్నపత్రం లీక్, టీఆర్‌ఈ-3 రద్దు

టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్‌ఈ-3 ని రద్దు చేసింది.

Paper Leak: టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్‌ఈ-3 ని రద్దు చేసింది. మార్చి 15న బీహార్‌లో 1 నుంచి 5వ తరగతి, 6 నుంచి 8వ తరగతి పరీక్షలు నిర్వహించగా, ఒకరోజు ముందుగానే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు ప్రశ్నపత్రాన్ని అభ్యర్థులకు విక్రయించారు.

అంతకుముందు బీహార్‌లోని ఆర్థిక నేరాల విభాగం (EOU) దర్యాప్తులో కోల్‌కతాలోని ప్రింటింగ్ ప్రెస్ నుండి పేపర్ లీక్ అయిందని మరియు బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన విశాల్ కుమార్ చౌరాసియా అనే వ్యక్తి దీనికి ప్రధాన సూత్రధారి అని తేల్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా మార్చి 15న రెండు షిఫ్టులలో జరిగిన పరీక్షను రద్దు చేసినట్లు BPSC తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Also Read: Pawan vs YSRCP : పవన్‌పై వైఎస్సార్‌ సీపీ కొత్త ప్లాన్‌.. ఫలించేనా..?