Site icon HashtagU Telugu

IT Raids: గుర్తింపులేని రాజ‌కీయ పార్టీల‌పై ఐటీదాడులు

IT Returns

IT Returns

గుర్తింపులేని పార్టీలు ఆర్థిక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ఐటీ విభాగం గుర్తించింది. ఆ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో దాడులు నిర్వ‌హిస్తోంది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు (ఆర్‌యుపిపి) పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ బుధవారం పలు రాష్ట్రాల్లో దాడులు ప్రారంభించింది. గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్న‌ట్టు అధికారంగా వెల్ల‌డించింది. RUPPలు, వాటి అనుబంధ సంస్థలు, ఆపరేటర్లు, ఇతరులపై ఆదాయ‌పు పన్ను శాఖ సమన్వయంలో త‌నిఖీల‌ను నిర్వ‌హిస్తోంది.

ఫిజికల్ వెరిఫికేషన్ సమయంలో ఉనికిలో లేవని తేలిన తర్వాత ఇటీవల RUPP జాబితా నుండి 87 పార్టీల‌ను రిజిస్ట్రేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ (EC) ఇటీవ‌ల సిఫార్సు చేసింది. వాటి ఆధారంగా ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. విరాళాల దాఖలుకు సంబంధించిన నిబంధనలను, ఎన్నికల చట్టాలను ఉల్లంఘించినందుకు, వారి చిరునామా ఆఫీస్ బేరర్‌ల పేర్లను అప్‌డేట్ చేయడంలో విఫలమైనందుకు 2,100 కంటే ఎక్కువ నమోదిత గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు పోల్ ప్యానెల్ ప్రకటించింది. ఈ పార్టీలలో కొన్ని “తీవ్రమైన” ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది.