Pan – Aadhaar : ‘పాన్‌-ఆధార్‌’ మే 31లోగా లింక్‌ చేసుకోండి.. లేదంటే డబుల్ పెనాల్టీ

మీరు పాన్‌-ఆధార్‌ లింక్ చేశారా ? చేస్తే ఓకే.. చేయని వాళ్లు కనీసం ఇప్పటికైనా అలర్ట్ కావాలి.

  • Written By:
  • Updated On - May 26, 2024 / 08:11 AM IST

Pan – Aadhaar : మీరు పాన్‌-ఆధార్‌ లింక్ చేశారా ? చేస్తే ఓకే.. చేయని వాళ్లు కనీసం ఇప్పటికైనా అలర్ట్ కావాలి. ఆదాయ పన్ను శాఖ మరోసారి ఇచ్చిన తుది గడువు  కూడా ముగియవస్తోంది.  మే 31లోగా పాన్-ఆధార్‌ను లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత లింక్ చేసుకుందాంలే అని అనుకుంటే.. మీరు రెట్టింపు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే పెనాల్టీగా రూ. 1,000 వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఈనెలలోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోకుంటే..  రెట్టింపు పెనాల్టీగా దాదాపు రూ.2వేలకుపైనే కట్టి ఆ పని చేసుకోవాల్సి వస్తుంది. అంతగా ఆర్థిక నష్టానికి గురయ్యే బదులు.. ఇప్పుడే లింక్ చేసుకోవడం బెటర్ కదా!

We’re now on WhatsApp. Click to Join

ఆధార్‌ నంబర్‌-పాన్‌ను ఫ్రీగా లింక్ చేసే గడువు ముగియడంతో చాలామంది పాన్ కార్డులు తాత్కాలికంగా డీయాక్టివేట్ అయ్యాయి. ఇలాంటి పాన్‌ కార్డ్‌ కలిగిన వారి నుంచి రెట్టింపు టీడీఎస్ (Tax Deducted at Source) లేదా  టీసీఎస్ (Tax Collected at Source) వసూలు చేస్తున్నారు. అయితే ఈనెల 31లోగా ఆధార్‌ – పాన్‌ లింక్ చేసుకుంటే.. పాన్ కార్డు తిరిగి యాక్టివేట్‌ అవుతుంది. ఇలాంటి వారి నుంచి రెట్టింపు టీడీఎస్ లేదా టీసీఎస్ వసూలు చేయరు. కాగా, ఈ ఏడాది జనవరి 29 నాటికి 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ వెల్లడించింది.

Also Read : Look At Your Palms : రోజూ నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలో తెలుసా ?

ఆధార్‌-పాన్ లింక్ ఇలా..  ‍‌

ఆధార్ – పాన్‌ను(Pan – Aadhaar) లింక్ చేయడం చాలా ఈజీ. ఇందుకోసం మీరు https://incometax indiaefiling.gov.in/ వెబ్‌సైటులోకి వెళ్లాలి. అక్కడ మీ వివరాలను సమర్పించి రిజిస్టర్‌ చేసుకోండి. యూజర్‌ ఐడీగా మీ పాన్‌ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌ల ద్వారా ఈ సైటులోకి లాగిన్ అయిన వెంటనే ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళితే.. ‘లింక్ ఆధార్‌’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసి ఓపెన్ చేయగానే.. మీ పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలను ఎంటర్ చేయాలి.  ఆధార్ కార్డు ప్రకారం మిగతా సమాచారమంతా అక్కడ బాక్సుల్లో నింపండి. తదుపరిగా కంటిన్యూ మీద క్లిక్ చేసి.. పెనాల్టీగా రూ. 1,000 పే చేయండి. పేమెంట్ చేశాక.. పాన్ – ఆధార్ లింక్ అవుతుంది. దీనికి ధ్రువీకరణగా మీ ఫోనుకు, మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది.

Also Read : Look At Your Palms : రోజూ నిద్రలేవగానే అరచేతులు ఎందుకు చూడాలో తెలుసా ?