Lok Sabha Poll : మోడీ ఓడిపోవాలి – పాక్ మాజీ మంత్రి కోరిక

గతంలోనూ ఫవాద్ చౌదరి రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా పలుమార్లు కామెంట్స్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Pakistan Former Minister Fa

Pakistan Former Minister Fa

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పర్వం నడుస్తుంది. మొత్తం ఏడు దశలకు గాను ఆరు దశల పోలింగ్ పూర్తి కాగా..జూన్ 1 న చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాదించబోతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మూడోసారి ముచ్చటగా మోడీ ప్రధాని కాబోతున్నాడని, 400 కు పైగా బిజెపి సీట్లు సాదించబోతుందని అంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ సైతం 400 సీట్లు సాదించబోతున్నామని చెపుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీపై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేసారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో మోదీతో పాటు ఆయన భావజాలం ఓడిపోవాలి. ఆయన ఓటమికి కారణమయ్యే రాహుల్ గాంధీ, అరవింద్ కేజీవాల్, మమతా బెనర్జీ లేక మరో నేత ఎవరైనా కానివ్వండి.. వారికి శుభాకాంక్షలు’ అంటూ ఫవాద్ పేరుకొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలోనూ ఫవాద్ చౌదరి రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా పలుమార్లు కామెంట్స్ చేశారు. దీనిపై మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దాయాది దేశం నుంచి మన దేశంలోని రాజకీయ నేతలకు మద్దతు లభించడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే, ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ఫవాద్ మరోసారి రాహుల్, కేజ్రీవాల్, మమతా బెనర్జీలకు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.

Read Also : AAP : స్వాతి మలివాల్‌ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్‌ కుమార్‌

  Last Updated: 29 May 2024, 04:04 PM IST