సింధూ నదీ జలాల (Indus Water) ఒప్పందం విషయంలో ఇప్పటివరకు దూకుడుగా వ్యవహరించిన పాకిస్థాన్ (Pakistan) తాజాగా తన వైఖరి మార్చుకుంది. భారత్ ఒప్పందాన్ని నిలిపివేస్తే తీరనంతపాటు ప్రాధాన్యత కలిగిన నీటి వనరులను కోల్పోతామన్న ఆందోళనతో, పాకిస్థాన్ ఇప్పుడు చర్చలకు సిద్ధమని పేర్కొంటోంది. భారత ప్రభుత్వం తాము సింధూ జలాల విషయంలో ఎలాంటి వెనకడుగు వేయబోమని స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో, పాకిస్థాన్ కొత్తగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Team India: విరాట్, రోహిత్‌లను భర్తీ చేసేది ఎవరు? టీమిండియా ముందు ఉన్న సమస్యలివే!
ఇందులో భాగంగా పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ, భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. సింధూ నదీ జలాలను నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన నీటి కొరత, పొలాలకు సాగునీరు లేకపోవడం, తాగునీటి సమస్యలు వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయనీ, అందుకే చర్చలు జరిపేందుకు సిద్ధమని ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా పంపినట్లు సమాచారం.
ఇదే సమయంలో భారత్ తన వైఖరిని మరింత దృఢంగా ఉంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ఇదివరకే “రక్తం, నీరు రెండూ ఒకేసారి ప్రవహించలేవు” అని చేసిన వ్యాఖ్యల ద్వారా సింధూ జలాల అంశం ఉగ్రవాదంతో అనుసంధానమై ఉన్నదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఆసరా ఇచ్చే దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, సింధూ జలాల ఒప్పందంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని భారత ప్రభుత్వం మళ్లీ మరొకసారి స్పష్టం చేసింది.