Site icon HashtagU Telugu

Hunger Index : ఆకలి సూచిలో పాకిస్తాన్, శ్రీలంక ముందంజ…మరింత దిగజారిన భారత్..!!

Hunger India

Hunger Copy

భారత్ కంటే శ్రీలంక,పాకిస్తాన్ దేశాలు అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉణ్నాయి. కానీ ఇప్పుడు ఒక విషయంలో మనకంటే ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకలిస్థాయి, పోషకాహార లోపాలు సూచించే ప్రపంచ హంగర్ ఇండెక్స్ లో భారత స్థానం దిగజారింది. మొత్తం 121 దేశాలను పరిగణలోనికి తీసుకుంటే మన భారత్ `107వ స్థానంలో నిలిచింది. శ్రీలంక 64, పాకిస్తాన్ 99వ స్థానంలో ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ భారత్ కంటే మెరుగైన స్ధానంలో ఉండటం చెప్పుకోదగ్గ విషయం.

GHI వార్షిక నివేదికను కన్ సర్న్ హంగర్, వెల్తుంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ విషయాన్ని ప్రచురించాయి. గత ఏడాది ఇదే సూచీలో భారత్ 101స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది మరింత దిగజారిపోవడం విమర్శలకు తావిస్తోంది. పౌష్టికాహారం, ఆకలి వంటి విషయాలపై మోదీ ఎప్పుడు స్పందిస్తారంటూ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానానికి దిగజారిందని ట్వీట్ చేశారు.

భారత్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ఇలాంటి ర్యాంక్ ఇచ్చారని కేంద్రం ఆరోపించింది. జనాభాను పరిగణలోనికి తీసుకుని జాబితాను రూపొందించలేదని కేంద్ర మహిళ శిశు అభివ్రుద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారతజనాభాలో కేవలం మూడు వేల మంది నుంచి సేకరించిన సమాచారంతో ఈ ర్యాంక్ ఇచ్చారని కేంద్రం స్పష్టం చేసింది.