Shimla Agreement : ‘సిమ్లా ఒప్పందం’ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్.. ఏమిటిది ?

సిమ్లా ఒప్పందం వల్లే భారత్, పాక్(Shimla Agreement) మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యానికి వీలు లేకుండా పోయింది.

Published By: HashtagU Telugu Desk
Simla Agreement Shimla Agreement Pakistan India Indus Water Treaty

Shimla Agreement : కశ్మీరులోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. సింధూ నదీ జలాల ఒప్పందం అమలును ఆపేసింది.  దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) అమలును ఆపేయాలని పాకిస్తాన్ యోచిస్తోందట. అయితే ఈ ఒప్పందం అమలును పాక్ ఆపేసినా.. భారత్‌కు పెద్దగా నష్టమేం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  ఇంతకీ ఏమిటీ ఒప్పందం ? దానిలోని నిబంధనలు ఏమిటి ? తెలుసుకుందాం..

Also Read :Pak Missile Tests: భయపడ్డ పాక్.. నేడు, రేపు కరాచీలో క్షిపణి పరీక్షలు

సిమ్లా ఒప్పందంలో ఏముంది ? 

  • 1971 సంవత్సరంలో భారత్ – పాక్ మధ్య భీకర యుద్ధం జరిగింది.
  • ఈ నేపథ్యంలో 1972 జులై 2న భారత్ – పాక్ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల మధ్యనున్న నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా, సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనేది ఈ ఒప్పందం సారాంశం.
  • నాటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), అప్పటి పాక్ అధ్యక్షుడు జుల్ఫికార్ అలీ భుట్టో  ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
  • సిమ్లా ఒప్పందం వల్లే భారత్, పాక్(Shimla Agreement) మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యానికి వీలు లేకుండా పోయింది. ఈ ఒప్పందం అనేది కశ్మీరు అంశంలో భారత్‌కు ఓ కవచంలా ఉపయోగపడింది.
  • ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా  ఇతర వివాదాస్పద అంశాల పరిష్కారంలో మూడో దేశం లేదా అంతర్జాతీయ సంస్థల జోక్యానికి లైన్ క్లియర్ అవుతుంది.
  • కశ్మీరు అంశంలో పాకిస్తాన్‌కు అండగా టర్కీ, చైనాలలో ఏదైనా ఒకదేశం రంగంలోకి దిగే సూచనలు ఉన్నాయి. గతంలోనూ టర్కీ, చైనాలు కశ్మీరు విషయంలో భారత్‌‌పై విషం కక్కాయి. వాటి మాటలను భారత్ ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొట్టింది.

Also Read :Gautam Gambhir: చంపేస్తామంటూ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ బెదిరింపులు

  • గతంలో భారత్, పాక్ మధ్య కుదిరిన సింధూ నదీజలాల పంపిణీ ఒప్పందానికి  ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది. ప్రపంచ బ్యాంకు నుంచి పాకిస్తాన్ భారీగా అప్పులు తీసుకుంది. భవిష్యత్తులో ప్రపంచ బ్యాంకు రంగంలోకి దీనిపై భారత్‌కు నచ్చజెప్పే అవకాశాలు ఉన్నాయి.
  Last Updated: 24 Apr 2025, 01:03 PM IST