Site icon HashtagU Telugu

India Vs Pakistan : ఉగ్రవాది హఫీజ్ సయీద్ అప్పగింత‌పై పాక్ రియాక్షన్ ఇదీ..

Hafiz Saeed

Hafiz Saeed

India Vs Pakistan : 2008లో ముంబైపై జరిగిన 26/11 ఉగ్రదాడి సూత్రధారి, ఉగ్ర సంస్థ లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాక్ నుంచి భారత్‌కు రప్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.  26/11 ఉగ్రదాడి సహా భారత్‌లో వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్‌ పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను పాకిస్తాన్ విదేశాంగ శాఖకు అందించామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. కొన్ని మనీలాండరింగ్ కేసుల్లోనూ ఉగ్రవాది హఫీజ్ పాత్ర ఉందన్నారు. ఈ కేసుల్లో భారత న్యాయస్థానాల విచారణను ఎదుర్కొనేందుకు అతడిని తమకు అప్పగించాలని పాక్‌ను కోరామని తెలిపారు.  ఇక ఈ అభ్యర్థనపై పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ స్పందించారు. హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్‌ నుంచి తమకు అభ్యర్ధన అందిందని ఆమె(India Vs Pakistan) వెల్లడించారు. అయితే భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక అప్పగింతల ఒప్పందం ఇప్పటిదాకా కుదర లేదని ఆమె చెప్పారు. ఈ కారణం వల్ల తాము భారత్ అభ్యర్థనపై ముందడుగు వేయలేకపోతున్నామని స్పష్టం చేశారు. 

We’re now on WhatsApp. Click to Join.

పాక్ ఎన్నికల బరిలో హఫీజ్ సయీద్ రాజకీయ పార్టీ

Also Read: Back Pain : విపరీతమైన నడుంనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?