Pakistan Faces Acute Fuel : పాకిస్తాన్‌లో తీవ్ర ఇంధన కొరత

Pakistan Faces Acute Fuel : ఇస్లామాబాద్‌ సహా పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ బంకులు 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు

Published By: HashtagU Telugu Desk
Severe Fuel Shortage In Pak

Severe Fuel Shortage In Pak

ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ (Pakistan ) తీవ్రంగా కుదేలవుతోంది. తాజాగా ఆ దేశాన్ని ఇంధన సంక్షోభం (Pakistan Faces Acute Fuel) తాకింది. ఇస్లామాబాద్‌ సహా పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ బంకులు 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, ఇంధన కొరత మరింత కష్టాల్లోకి నెట్టేసింది.

Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్‌, భటిండాలలో రెడ్ అలర్ట్

ఈ బంకుల మూసివేత వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్మీ వాహనాల నిర్వహణకు అధిక ఇంధనం అవసరమవుతోంది. అలాగే యుద్ధ సమయంలో బ్లాక్‌అవుట్‌ నివారణకు జనరేటర్లకు పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేయాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఇంధన సరఫరా నిలిపివేశారని సమాచారం. వాహనాలకే కాకుండా ప్రభుత్వ విభాగాలకూ ఇంధనం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెట్రోల్ బంకుల మూసివేతతో ప్రజల తాకిడి పెరిగి, ఆందోళనలు భగ్గుమన్నాయి.

ఇక మరోవైపు పాక్ సైన్యం రాజౌరి పట్టణంపై విరుచుకుపడిన దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తో పాటు మరో ఐదుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించారు.

  Last Updated: 10 May 2025, 11:25 AM IST