Site icon HashtagU Telugu

Baba Ramdev : పాక్‌కు పోరాడే శక్తి లేదు.. యుద్ధం జరిగితే నాలుగు రోజులు కూడా నిలవలేదు: బాబా రాందేవ్‌

Pakistan does not have the strength to fight.. If there was a war, it would not last even four days: Baba Ramdev

Pakistan does not have the strength to fight.. If there was a war, it would not last even four days: Baba Ramdev

Baba Ramdev : ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌ భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ తరచూ భారత వ్యతిరేక ప్రస్తావనలు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, ఆ దేశం స్వయంగా విచ్ఛిన్నమవుతున్నదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో అంతర్గత సమస్యలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కి భారత్‌తో పోరాడే శక్తి లేదని ధ్వజమెత్తారు.

Read Also: India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?

రాందేవ్‌ మాట్లాడుతూ.. “బలూచిస్తాన్‌, సింధ్‌, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. బలూచ్‌ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ ప్రజలకు నిత్యావసరాలు అందట్లేదు. ఆ ప్రాంతం కూడా త్వరలో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టవచ్చు” అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, పాకిస్థాన్‌ ప్రస్తుతం ఆర్థిక, రాజకీయ క్షీణతలో ఉందని, ప్రభుత్వానికి ప్రజలపై నియంత్రణ లేకపోయిందని రాందేవ్‌ విమర్శించారు. “పాక్‌ ప్రభుత్వానికి తన స్వదేశ ప్రజలే పట్టించుకోవడం లేదు. భారత్‌తో యుద్ధం చేసే స్థితిలో కాదు. ఒకవేళ భారత్‌తో యుద్ధం జరిగితే పాకిస్థాన్‌ నాలుగు రోజులు కూడా నిలబడలేదని నేను ఖచ్చితంగా చెబుతాను” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాందేవ్‌ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వీటిని దేశభక్తి భావనలతో నిండి ఉన్నవిగా చూస్తుండగా, మరికొందరు ఇవి మరో దేశంపై అనవసరంగా వేసిన విమర్శలుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత గడియిలో, భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాందేవ్‌ వ్యాఖ్యలు మరింత దృష్టిని ఆకర్షించాయి. యోగా గురువిగా మాత్రమే కాకుండా దేశానికి సంబంధించి తన భావాలను గట్టిగా వెలిబుచ్చే వ్యక్తిగా ఆయన మళ్లీ వార్తల్లోకెక్కారు.

Read Also: India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?