BSF Jawan : భారత జవానును బంధించిన పాకిస్థాన్

ఈ ఆరోపణలను BSF ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటాడని.. తప్పుడు ఆరోపణలతో జవాన్‌ను అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. అతని విడుదలకు వీలుగా రెండు దళాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వార్తా సంస్థ PTI నివేదిక తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Pakistan Captures Indian So

Pakistan Captures Indian So

BSF Jawan: పహల్గామ్ దాడిపై భారతావని కంటతడి ఆగకముందే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. ఏప్రిల్ 23న డ్యూటీ చేస్తూ పొరపాటున సరిహద్దు దాటిన BSF జవానును పాకిస్థాన్ రేంజర్లు బంధించారు. ఫిరోజ్‌పూర్ (పంజాబ్) వద్ద సైనికుడు తమ భూభాగంలోకి ప్రవేశించడంతోనే అరెస్టు చేశామని పాక్ సైన్యం చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటాడని.. తప్పుడు ఆరోపణలతో జవాన్‌ను అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. అతని విడుదలకు వీలుగా రెండు దళాల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని వార్తా సంస్థ PTI నివేదిక తెలిపింది.

Read Also: Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. పాకిస్తానీ భామలకు షాక్

రెండు దేశాల సరిహద్దులు కలిసే సరిహద్దు భాగాన్ని జీరో లైన్ అంటారు. రైతులకు ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయడానికి ప్రత్యేక అనుమతి లభిస్తుంది. రైతులు పంటలు కోసేటప్పుడు వారి భద్రత కోసం BSF సైనికులు వారితో ఉంటారు. వారిని రైతు రక్షకులు అని కూడా అంటారు. రైతులు పంట కోస్తున్న ప్రదేశంలో ఆ సైనికుడు వారిని గమనిస్తున్నాడని తెలిపింది. అయితే జీరో లైన్ కు చాలా ముందుగానే ముళ్ల తీగను ఏర్పాటు చేస్తారు. జీరో లైన్ పై స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేస్తారు. అక్కడ వేడి తీవ్రంగా ఉండటంతో సైనికుడు జీరో లైన్ దాటి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి ఒక చెట్టు నీడ కింద కూర్చున్నాడు. ఇంతలో పాకిస్తానీ రేంజర్లు అతన్ని చూసి అదుపులోకి తీసుకుని వెంటనే అతని ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలని భారతదేశం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సహా ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశం ఈ కఠినమైన నిర్ణయాలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు.

Read Also: Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌కు 14 రోజుల రిమాండ్‌

 

  Last Updated: 24 Apr 2025, 09:45 PM IST