పాకిస్తాన్ (Pakistan ) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ ఆర్థిక భాగస్వాములు విరాళాలు ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ ఆర్థిక శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్టు పెట్టడం కలకలం రేపింది. “మేము కష్టాల్లో ఉన్నాం, విరాళాలు ఇవ్వండి” అనే భావంతో కూడిన ఈ పోస్ట్ దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలైంది. ఉగ్రవాదం, యుద్ధ ప్రేరణలపై నిలదీసే విమర్శలు వెల్లువెత్తడంతో, ఆ ట్వీట్‌ను తొలగించి “ట్విట్టర్ హ్యాండ్‌లను హ్యాక్ చేశారు” అంటూ సర్ది చెప్పింది. కానీ అసలు కారణం పరువు పోతుందన్న భయం, అంతర్జాతీయంగా అవమానం ఎదుర్కొనే పరిస్థితి అన్నదే.
Death People: చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
ఇక భారతదేశం రెండు రోజులుగా జరిపిన ఆర్థిక, సైనిక దాడుల ప్రభావం పాకిస్తాన్‌పై ఘాటుగా పడింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఫైటర్ జెట్లు, డ్రోన్లతో భారత దళాలు ఎలాంటి నష్టం లేకుండా విజయవంతంగా తిరిగి వచ్చాయి. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌కు రోజువారీ ఆదాయం తగ్గిపోయింది. వాణిజ్య మార్గాలు నిలిచిపోయాయి. ఇప్పుడు అప్పు కోసం ఆర్థిక సంస్థల వద్దకు వెళ్లినా, అందిన దాఖలాలతో వాటికి నమ్మకం కలగడం లేదు. ఇచ్చే అప్పులను కూడా పాకిస్తాన్ యుద్ధానికి వినియోగించే ప్రమాదం ఉండటంతో, నిధుల విడుదలలో ఆసక్తి చూపడం లేదు.
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా కూలిపోయే పరిస్థితిలో ఉంది. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరి డబ్బు వెనక్కి తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. విత్‌డ్రా పరిమితులు పెట్టారు. స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. రోజురోజుకు వడ్డీ భారం పెరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా, పరిస్థితి మాత్రం అదే సంకేతాలు ఇస్తోంది. భారత్ ప్రారంభించిన ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్‌కు లేకుండా పోయింది. ఇప్పుడు అది ఎదుర్కొంటున్నది యుద్ధ భయంకంటే ఆర్థిక విధ్వసమే ఎక్కువ.