Pak Violates Ceasefire : పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇవాళ తెల్లవారుజామున 2.35 గంటలకు జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ ఏరియాలో ఉన్న సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద భారత సైన్యంపైకి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన బీఎస్ఎఫ్ సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. పాక్ కాల్పులను బీఎస్ఎఫ్ బలగాలు తిప్పికొట్టాయి. భారత్ ప్రతిదాడిలో పాక్ వైపు ఎంతమందికి గాయాలయ్యాయి అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈవివరాలను బీఎస్ఎఫ్ అధికార వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అఖ్నూర్ ఏరియాలో బీఎస్ఎఫ్ బలగాలు ప్రస్తుతం హైఅలర్ట్ మోడ్‌లో(Pak Violates Ceasefire) ఉన్నాయని తెలిపాయి. బార్డర్ వద్ద ముమ్మర గస్తీ కొనసాగుతోందని పేర్కొన్నాయి.
Also Read :Trump Vs Kamala : ‘‘కమల పెద్ద మార్క్సిస్ట్’’.. ‘‘ట్రంప్ అమెరికాను చైనాకు అమ్మేశారు’’.. హోరాహోరీగా డిబేట్
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 2021 ఫిబ్రవరి 25న రెన్యూవల్ అయింది. అయినా తరుచుగా సరిహద్దు ఏరియాలో పాక్ కాల్పులు జరుపుతూనే ఉంది. గతేడాది కశ్మీర్‌లోని రాంఘర్ సెక్టార్‌పైకి పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భారత బీఎస్ఎఫ్ జవాన్ అమరుడయ్యాడు. త్వరలోనే కశ్మీర్‌లో మూడు విడతల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ ఈవిధంగా భారత్‌పై కవ్వింపు దాడులకు పాల్పడటం గమనార్హం. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1 తేదీల్లో కశ్మీరులో అసెంబ్లీ పోల్స్ జరగనున్నాయి. అక్టోబరు 8న కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read :Chakali Ailamma : కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు – సీఎం రేవంత్
1999 సంవత్సరంలో భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో తాము పాల్గొనలేదని అప్పట్లో పాక్ ఆర్మీ చెప్పుకుంది. కొందరు ముజాహిదీన్లు ఆ యుద్ధంలో పాల్గొన్నారని ఆనాడు పాక్ వాదించింది. అప్పట్లో భారత్ వైపు పడి ఉన్న పాక్ సైనికుల డెడ్‌బాడీలను కూడా పాక్ తీసుకెళ్లలేదు. తాము చేసిన చొరబాటు బయటపడొద్దనే ఉద్దేశంతో సైనికుల డెడ్‌బాడీలను తీసుకెళ్లేందుకు కూడా పాక్ ఆనాడు నో చెప్పింది. ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అసలు నిజమేంటో వెల్లడించారు. కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది పాక్ సైనికులు చనిపోయారని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నారు.