Golden Temple : గోల్డెన్‌ టెంపుల్‌పై పాకిస్థాన్ కన్ను పడిందా..?

Golden Temple : పాకిస్థాన్ చేసిన దాడుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌(Golden Temple)ను లక్ష్యంగా పెట్టే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు

Published By: HashtagU Telugu Desk
Karthik C Seshadri

Karthik C Seshadri

ఇటీవల పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) పాక్‌పై బలమైన ప్రతీకార దాడిగా మారింది. ఈ ఆపరేషన్ నేపథ్యంలో పాక్ భారత్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడులకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరిణామాలపై మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి (Karthik C Seshadri) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్ చేసిన దాడుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్‌(Golden Temple)ను లక్ష్యంగా పెట్టే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు. భారత సైన్యం ముందుగానే ఈ విషయాన్ని అంచనా వేసి గోల్డెన్ టెంపుల్‌కు అదనపు రక్షణ ఏర్పాటు చేసింది.

Master Bharath : ‘రెడీ’ నటుడు ఇంట్లో విషాదం

పాక్‌కు నిర్దిష్టమైన టార్గెట్లు లేకపోవడంతో, ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమైన గోల్డెన్ టెంపుల్‌పై దాడికి ప్రయత్నించినట్లు మేజర్ జనరల్ తెలిపారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ ద్వారా డ్రోన్లు, క్షిపణులు కూల్చివేయబడ్డాయి. దీంతో టెంపుల్‌కి ఎలాంటి నష్టం జరగకుండా, శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో భారత సైన్యం విజయవంతమైంది. ఈ చర్యలు దేశంలోని సైనిక వ్యవస్థ బలాన్ని మరోసారి చాటిచెప్పాయి.

ఇక ఆపరేషన్ సిందూర్‌లో భారత ఆర్మీ POKలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు మృతిచెందారని సైన్యం తెలిపింది. అనంతరం పాక్ తిరగదాడిగా డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడికి యత్నించింది. అయితే ఎస్-400, ఆకాశ్ వంటి ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి అన్నారు.

  Last Updated: 19 May 2025, 02:50 PM IST