పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీసుకున్న కఠిన నిర్ణయం అమలులోకి వచ్చింది. పాకిస్థాన్(Pakistan)కు చెందిన SAARC వీసా హోల్డర్లకు భారతదేశంలో ఉండటానికి ఇచ్చిన 48 గంటల గడువు ఈరోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో వేలాదిమంది పాకిస్థానీయులు వాఘా-అట్టారీ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుని తమ స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం స్పష్టంగా గడువు ముగిసిన తర్వాత వీరికి ఇక భారత్‌లో ఉండటానికి అనుమతి ఉండదని చెప్పడం తో వారంతా తమ సొంత ఊర్లకు వెళ్తున్నారు.
Mahesh : ఈడీకి మహేష్ బాబు రిక్వెస్ట్ లెటర్
పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రభుత్వం కఠిన వైఖరి అనుసరించింది. పాక్ నుండి వచ్చిన వారి విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా, SAARC వీసాతో భారత్‌లో ఉన్నవారికి ఈ నెల 26 వరకు గడువు విధించారు. తమ సరిహద్దుల్లో భద్రతాపరమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థానీయుల పోటెత్తడం స్పష్టంగా కనిపిస్తోంది.
అటు మెడికల్ వీసా ఆధారంగా భారత్ వచ్చిన పాక్ పౌరులకు మాత్రం కొంత ఉపశమనం ఇచ్చింది. వారికి ప్రత్యేకంగా ఈ నెల 29 వరకు గడువు పెంచింది. అత్యవసర చికిత్సల కోసం వచ్చిన వారిని ఒక మానవతా దృష్టితో సమీక్షిస్తూ, కాస్త వెసులుబాటు కల్పించినట్టు అధికారులు తెలిపారు. మొత్తంగా చూస్తే పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న భద్రతా చర్యలు మరింత కఠినమైనవిగా మారుతున్నాయి.