Site icon HashtagU Telugu

Pak drone: మరో పాక్ డ్రోన్ కలకలం.. కూల్చిన బీఎస్ఎఫ్ బలగాలు

Drones

Drones

దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్లు (drone) కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ డ్రోన్‌ (drone)ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చి వేశాయి. డ్రోన్ కదలికలను జవాన్లు గుర్తించి అప్రమత్తమై కాల్పులు జరిపారు. కాగా.. కొన్ని రోజులుగా పాక్ నుంచి ఆయుధాలు, మాదకద్రవ్యాల సరఫరాకు వీటిని ఉపయోగిస్తున్నారు. అమృత్‌సర్ సెక్టార్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

ఇటీవల అంతర్జాతీయ సరిహద్దు గుండా పంజాబ్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కూల్చివేసింది. పాకిస్థాన్ సరిహద్దులో డ్రోన్ పడిపోయిందని చెప్పాడు. ఆ అధికారి ప్రకారం మంగళవారం రాత్రి 7.20 గంటలకు BSF జవాన్లు ఈ అనుమానాస్పద పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చివేశారు. అమృత్‌సర్‌లోని డాక్‌ పోలీస్‌ పోస్ట్‌ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. బుధవారం ఉదయం సోదాలు నిర్వహించగా డ్రోన్ భారత సరిహద్దు ఔట్‌పోస్ట్ భరోపాల్ మీదుగా పాకిస్తాన్ సరిహద్దులో 20 మీటర్ల దూరంలో పడిపోయినట్లు గుర్తించామని BSF అధికార ప్రతినిధి తెలిపారు. తర్వాత పాకిస్థాన్ రేంజర్లు డ్రోన్ ని తమతో తీసుకెళ్లారు.