Site icon HashtagU Telugu

Drone Shot Down: డ్రోన్ ను కాల్చివేసిన భద్రతా బలగాలు.. ఆయుధాలు స్వాధీనం

Drone

Resizeimagesize (1280 X 720) (4)

పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) BOP మెట్ల సమీపంలో పాకిస్తాన్ డ్రోన్‌ (Drone)ను గుర్తించింది. దీని తరువాత, బీఎస్ఎఫ్ జవాన్లు, బటాలా పోలీసులు సంయుక్తంగా రాత్రిపూట సోదాలు నిర్వహించారు. శుక్రవారం కూడా బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. థానా కోట్లి సూరత్ మల్హికి చెందిన నాభినగర్ గ్రామ పొలాల్లో డ్రోన్ పడి ఉంది. అంతే కాకుండా ఆయుధాలు కూడా దొరికాయి.

ఈ విషయమై బటాలా ఎస్పీ గుర్‌ప్రీత్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. గురువారం అర్థరాత్రి బీఎస్‌ఎఫ్ మెట్ల పోస్ట్ వద్ద డ్రోన్ కనిపించిందని తెలిపారు. దీని తర్వాత బటాలాలోని డేరా బాబా నానక్‌కు చెందిన పోలీసులు, బిఎస్‌ఎఫ్ రాత్రి నుండి సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. .అయితే ఆ డ్రోన్‌ చైనాకు చెందిందని అధికారులు అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ మొదలు పెట్టారు.

Also Read: KCR on Kavitha Case: కవిత అరెస్ట్ పై కేసీఆర్, 99 శాతం ఫిక్స్!

సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం కోట్లి సూరత్ మల్హిలోని నభీపూర్ గ్రామంలోని పొలాల్లో పెద్ద పాకిస్తాన్ డ్రోన్ కనుగొనబడింది. దీంతో పాటు ఒక ఏకే-47, రెండు మ్యాగజైన్‌లు, 40 కాట్రిడ్జ్‌లు కూడా లభ్యమయ్యాయి. ఈ డ్రోన్‌పై పొలం యజమాని స్వయంగా బటాలా పోలీసులకు, బీఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించాడు. డ్రోన్, ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.

Exit mobile version