Site icon HashtagU Telugu

Pak Army Chief Asim Munir : పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ జంప్..?

Pak Army Chief Asim Munir

Pak Army Chief Asim Munir

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ దాడిలో టూరిస్టులు మరణించడం, పలువురు గాయపడటంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో భారత్‌లో ఉన్న పాకిస్తాన్ జాతీయులకు దేశం విడిచిపోవాలని మోదీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆర్మీపై ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌(Pak Army Chief Asim Munir)పై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చాయి.

Veeraiah Chowdary Murder Case : ఒక్కో పోటుకు రూ.2 లక్షలు!

పహల్‌గామ్ దాడి అనంతరం మీడియా ముందు కనిపించిన ఆసిమ్ మునీర్..పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాతః ఎక్కడికి వెళ్లాడో తెలీని పరిస్థితి నెలకొంది. తాజా నివేదికల ప్రకారం ఆయన కుటుంబంతో కలిసి లండన్ లేదా న్యూజెర్సీకి పారిపోయినట్టు చెబుతున్నారు. భారత్ తక్షణ ప్రతీకారం తీసుకునే అవకాశాన్ని గమనించి భయంతో దేశం విడిచినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. పాక్ లో మందుల కొరత, ఆర్థిక కష్టాలతో ప్రజలు తీవ్ర స్థాయిలో బాధపడుతుండటంతో ప్రభుత్వంపై, సైన్యంపై ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగింది.

పహల్‌గామ్ ఘటన తర్వాత పాక్ లో తీవ్ర ప్రజా ఆందోళనలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఆసిమ్ మునీర్ రాజీనామా చేయాలని, సైనిక వ్యాపారాలను బహిష్కరించాలని ఉద్యమాలు మొదలయ్యాయి. #RemoveAsimMunir, #FreeImranKhan వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యం నామమాత్రమేనని, దేశాన్ని నిజంగా పాలిస్తున్నది సైన్యమేనని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు. మొత్తానికి పాకిస్థాన్ లో పాలక వ్యవస్థపై ప్రజల అసంతృప్తి బయటపడిన ఈ ఘటన, భవిష్యత్ రాజకీయ పరిస్థితులపై భారీ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.