Site icon HashtagU Telugu

Pahalgam Terror Attack : NIA చేతికి సంచలన వీడియో..బయటపెట్టేది అప్పుడే !

Pahalgam Terror Attack Vide

Pahalgam Terror Attack Vide

పహల్గామ్‌లో తాజాగా జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి ఈ దాడికి సంబంధించిన ఓ సంచలన వీడియో లభించింది. కాల్పులు మొదలవగానే ఓ ఫోటోగ్రాఫర్ తన ప్రాణాలను రక్షించుకుంటూ ఒక చెట్టు పైకి ఎక్కి దాక్కొని, ఆ తర్వాత తన కెమెరాతో మొత్తం దాడి దృశ్యాలను ధైర్యంగా చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు దర్యాప్తు బృందానికి కీలక ఆధారంగా మారింది.

Shruti Haasan Love : వీడు ఎన్నో ‘NO ‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు – శృతి హాసన్ ఎమోషనల్

వీడియోలో ఉగ్రవాదుల కదలికలు, దాడి తీరులు స్పష్టంగా కనబడుతున్నాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఎవరు? వారికి సహకరించిన స్థానిక మద్దతుదారులు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ఫుటేజ్‌ను NIA విశ్లేషిస్తోంది. ఒక సీనియర్ అధికారి ప్రకారం.. ఈ వీడియో ఆధారంగా నిందితులను గుర్తించేందుకు, తదుపరి చర్యలు చేపట్టేందుకు దోహదపడనుందని వెల్లడించారు. ఇప్పటికే ఫోటోగ్రాఫర్ నుంచి పూర్తి వివరాలను సేకరించినట్లు సమాచారం.

ఫోటోగ్రాఫర్ వాంగ్మూలంతో పాటు, వీడియోలో కనిపించిన సమాచారం ఆధారంగా NIA ఇప్పటికే కొందరిని విచారణకు పిలవడానికి ఏర్పాట్లు చేస్తోంది. నిందితుల బలమైన ఆధారాలు లభించిన తరువాత, వారి మద్దతుదారుల సంబంధాలు, మౌలిక మద్దతు వ్యవస్థలను కూడా విచారించనున్నారు. త్వరలోనే దాడిలో పాల్పడినవారిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.