Parliament Session : జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ దారుణ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో స్పందిస్తూ, ఇది అత్యంత క్రూరమైన చర్యగా వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు తక్షణమే స్పందించాయని, ఉగ్రవాదులను వెంబడించి, దేశ సరిహద్దులు దాటకుండా అన్ని ప్రాంతాల్లో కఠిన చర్యలు ప్రారంభించామని తెలిపారు.
లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ‘ఆపరేషన్ మహదేవ్’ ప్రారంభించామని వివరించారు. ఈ నెల 22న ఉగ్రవాదుల ఆచూకీ లభ్యమైందని, వారు దాచిగామ్ సమీపంలోని మహదేవ్ కొండల్లో దాగి ఉన్నట్లు సమాచారం అందిందని చెప్పారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టి, పహల్గామ్ దాడి ప్రధాన సూత్రధారి సులేమాన్ షాతో పాటు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారని ఆయన స్పష్టం చేశారు.
Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వార్త.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి
తన ప్రసంగం జరుగుతున్న సమయంలో పదేపదే అడ్డుకొనే ప్రతిపక్ష ఎంపీలపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి, “ఉగ్రవాదుల మతం చూసి బాధపడొద్దు” అంటూ కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్‌ను ఎందుకు వెనకేసుకువస్తున్నారు అంటూ ప్రతిపక్ష నేతలను నిలదీశారు. పాకిస్థాన్‌తో మీరు చర్చలు జరపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇటీవలి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, “ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారేనని మేము చెబితే ఆధారమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదుల వద్ద పాకిస్థాన్‌లో తయారైన చాక్లెట్లు దొరికాయి. ఇంతకీ ఇంకా ఏ ఆధారం కావాలి?” అని షా ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.
పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెట్టడం దేశ ప్రజలకు గర్వకారణమని, అలాంటి విజయాలపై ప్రతిపక్ష నేతలూ ఆనందం వ్యక్తం చేస్తారని తాము భావించినట్లు అమిత్ షా చెప్పారు. అయితే, చర్చలో ప్రతిపక్ష ప్రవర్తనను చూస్తుంటే ఉగ్రవాదుల తుదముట్టింపు వారికి సంతోషం కలిగించలేదని షా విమర్శించారు. దేశ భద్రత, ఉగ్రవాదుల నిర్మూలనపై ప్రభుత్వం కఠినమైన వైఖరిని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. పోలవరం వద్ద కూడా